కొనసాగుతున్న మేడారం హుండీల లెక్కింపు

మేడారం జాతరలో ఏర్పాటు చేసిన హుండీల లెక్కింపు కొనసాగుతోంది. వరంగల్ అర్బన్‌ జిల్లా హన్మకొండలోని తితిదే కల్యాణ మండపంలో 494 హుండీలను భద్రపరిచారు. గత మూడు రోజులుగా హుండీలు తెరిచి కానుకల లెక్కింపు కొనసాగిస్తున్నారు. శుక్రవారం...

Updated : 14 Feb 2020 21:03 IST

బాలసముద్రం‌: మేడారం జాతరలో ఏర్పాటు చేసిన హుండీల లెక్కింపు కొనసాగుతోంది. వరంగల్ అర్బన్‌ జిల్లా హన్మకొండలోని తితిదే కల్యాణ మండపంలో 494 హుండీలను భద్రపరిచారు. గత మూడు రోజులుగా హుండీలు తెరిచి కానుకల లెక్కింపు కొనసాగిస్తున్నారు. శుక్రవారం నాటికి 194 హుండీల్లోని లెక్కింపు పూర్తి అయింది. శుక్రవారం నాటికి రూ.5,62,92,000 ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. మరో నాలుగు రోజులపాటు లెక్కింపు కొనసాగనుందని అధికారులు వెల్లడించారు.

జాతర చివరి రోజు మధ్యాహ్నం మేడారంలో వర్షం కురవడంతో కొన్ని హుండీల్లో వర్షపు నీరు చేరి నోట్లు, కానుకలు తడిసి ముద్దయ్యాయి. దీంతో వాలంటీర్లు ఆ నోట్లను వేరు చేయడానికి కాస్త ఇబ్బంది పడ్డారు. బెల్లంతో పాటు ఇతర నైవేద్యాలు అతుక్కోవడంతో జిగురుగా మారిన నోట్లను నీటిలో ముంచి ఆరబెడుతున్నారు. తడి ఆరిన అనంతరం వాటిని లెక్కించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని