‘స్థానిక’ రిజర్వేషన్ల ప్రక్రియ వేగవంతం

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం రిజర్వేషన్లు ఖరారుచేసే ప్రక్రియ వేగవంతమైంది. రిజర్వేషన్లను ఖరారు చేస్తూ జిల్లా కలెక్టర్లు గెజిట్‌ విడుదల చేసి ఆమోదం కోసం ఎన్నికల సంఘానికి పంపుతున్నారు. ఇప్పటి వరకు 10 జిల్లాల్లో ఎంపీటీసీ,

Updated : 06 Mar 2020 15:12 IST

అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం రిజర్వేషన్లు ఖరారుచేసే ప్రక్రియ వేగవంతమైంది. రిజర్వేషన్లను ఖరారు చేస్తూ జిల్లా కలెక్టర్లు గెజిట్‌ విడుదల చేసి ఆమోదం కోసం ఎన్నికల సంఘానికి పంపుతున్నారు. ఇప్పటి వరకు 10 జిల్లాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. శ్రీకాకుళం, పశ్చిమగోదావరి, గుంటూరు మినహా మిగిలిన 10 జిల్లాల ఎంపీటీసీ, ఎంపీపీ రిజర్వేషన్లు ఖరారుచేశారు. పశ్చిమగోదావరి, గుంటూరు, చిత్తూరు మినహా 10 జిల్లాల జడ్పీటీసీ రిజర్వేషన్ల  ఖరారు ప్రక్రియ దాదాపు పూర్తైంది. పశ్చిమగోదావరి, గుంటూరు మినహా 11 జిల్లాల ఎంపీపీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. కలెక్టర్లు పంపిన గెజిట్‌ ఆమోదించిన అనంతరం రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో పొందుపరుస్తున్నారు.
 http://sec.ap.gov.in  వెబ్‌సైట్‌లో గ్రామాలవారీగా రిజర్వేషన్ల జాబితాను అప్‌డేట్‌ చేస్తున్నారు. గ్రామపంచాయతీ, పురపాలక, నగరపాలక సంస్థలు, జిల్లా పరిషత్ అధ్యక్షుల రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ ఏ జిల్లాలోనూ ఇంకా ఖరారు కాలేదు. గ్రామాల వారీగా రిజర్వేషన్ కేటాయింపు ప్రక్రియ సత్వరం పూర్తి చేసేలా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. రిజర్వేషన్లు ఖరారు ప్రక్రియ పుర్తయిన  అనంతరం ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు