మహిళలు నైపుణ్యం సాధించాలి: ఉపరాష్ట్రపతి

సమాజంలో మహిళల పట్ల వివక్ష పోవాలని ఉప రాష్ర్టపతి వెంకయ్యనాయుడు అన్నారు. స్త్రీ లేకపోతే జననం, గమనం, సృష్టే లేదన్నారు. భారతదేశంలో మహిళలకు పురాణాలు, వేదాలు, ఉపనిషత్తుల్లో గొప్ప స్థానం....

Published : 09 Mar 2020 01:30 IST

హైదరాబాద్‌: సమాజంలో మహిళల పట్ల వివక్ష పోవాలని ఉప రాష్ర్టపతి వెంకయ్యనాయుడు అన్నారు. స్త్రీ లేకపోతే జననం, గమనం, సృష్టే లేదన్నారు. భారతదేశంలో మహిళలకు పురాణాలు, వేదాలు, ఉపనిషత్తుల్లో గొప్ప స్థానం ఉందన్నారు. హైదరాబాద్‌ దస్పల్లా హోటల్‌లో ‘ఫౌండేషన్‌ ఫర్‌ ఫ్యూచరెస్టిక్‌’ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉప రాష్ర్టపతితో పాటు తెలంగాణ గవర్నర్‌ తమిళిసై ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి మహిళ ఏదో ఒక రంగంలో నైపుణ్యం సంపాదించాలని వెంకయ్యనాయుడు అన్నారు. గుర్తింపు రావాలన్నా, ఉన్నత స్థితికి చేరుకోవాలన్న నైపుణ్యం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. మహిళల ఉన్నతే దేశ అభ్యున్నతని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. తమ ఇంట్లో వాళ్లు ఆడపిల్లనని చూడకుండా ప్రోత్సహించారు కాబట్టే రాజకీయాల్లోకి ధైర్యంగా వచ్చి రాణించగలిగానన్నారు. మహిళా ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం, దేశం, ప్రపంచం ఆరోగ్యంగా ఉంటుందని తమిళసై పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని