తప్పించుకుంటే హత్యాయత్నం అభియోగాలే

దేశ రాజధాని దిల్లీలో తబ్లీగీ జమాత్‌ ఇటీవల నిర్వహించిన మతపరమైన కార్యక్రమంలో పాల్గొని కూడా ఇప్పటివరకూ అధికారులకు సమాచారమివ్వకుండా...

Published : 07 Apr 2020 08:40 IST

  పరీక్షలు చేయించుకోని ‘తబ్లీగీ’లపై చర్యలకు రంగం సిద్ధం

కాన్పుర్‌: దేశ రాజధాని దిల్లీలో తబ్లీగీ జమాత్‌ ఇటీవల నిర్వహించిన మతపరమైన కార్యక్రమంలో పాల్గొని కూడా ఇప్పటివరకూ అధికారులకు సమాచారమివ్వకుండా తప్పించుకు తిరుగుతున్నవారిపై హత్యాయత్నం అభియోగాలు మోపాలని కొన్నిచోట్ల అధికారవర్గాలు యోచిస్తున్నాయి. కఠినమైన జాతీయ భద్రత చట్టాన్ని(ఎన్‌ఎస్‌యేను) వారిపై ప్రయోగించే అంశాన్నీ పరిశీలిస్తున్నాయి. ‘తబ్లీగీ’ కార్యక్రమంలో కనీసం 9 వేలమంది పాల్గొన్నట్లు అంచనా. వారిలో ఎక్కువమంది తమ తమ ప్రాంతాలకు వెళ్లిపోయారు. అక్కడికి వెళ్లొచ్చినవారు, వారితో సన్నిహితంగా మెలిగినవారంతా పరీక్షలు చేయించుకోవాలని దేశవ్యాప్తంగా అధికారవర్గాలు సూచించినా, చాలామంది ఇప్పటికీ బయటకు రావట్లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు