మాదకద్రవ్యాల పరిమాణం ఆధారంగానే శిక్ష 

నిషిద్ధ మాదక ద్రవ్యాలు పట్టుబడినప్పుడు వాటి స్వచ్ఛత ఎంత అనేది కాకుండా మొత్తం పరిమాణం ఆధారంగానే ముద్దాయికి శిక్షను నిర్ణయించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. మాదక ద్రవ్యాల చట్టంపై జస్టిస్‌ అరుణ్‌ మిశ్ర, జస్టిస్‌ ఇందిరా బెనర్జీ, జస్టిస్‌ ఎం.ఆర్‌.షాలతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు స్పష్టతనిచ్చింది.

Updated : 23 Apr 2020 23:46 IST

 సుప్రీంకోర్టు స్పష్టీకరణ


 

దిల్లీ: నిషిద్ధ మాదక ద్రవ్యాలు పట్టుబడినప్పుడు వాటి స్వచ్ఛత ఎంత అనేది కాకుండా మొత్తం పరిమాణం ఆధారంగానే ముద్దాయికి శిక్షను నిర్ణయించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. మాదక ద్రవ్యాల చట్టంపై జస్టిస్‌ అరుణ్‌ మిశ్ర, జస్టిస్‌ ఇందిరా బెనర్జీ, జస్టిస్‌ ఎం.ఆర్‌.షాలతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు స్పష్టతనిచ్చింది. ఒక మిశ్రమంలో తటస్థ పదార్థం ఎంత, నిషిద్ధ పదార్థాల వాస్తవ బరువెంత అనేవి చూశాక అది చిన్న పరిమాణమా, వాణిజ్య కోసం ఉద్దేశించిన మొత్తమా అనేది నిర్ధారించాలని తెలిపింది. దేశ యువతలో మాదక ద్రవ్యాల వాడకం కొంత కాలం నుంచి పెరిగిపోతోందనీ, దీనిపై కఠినంగా వ్యవహరించాల్సిందేనని తెలిపింది. డ్రగ్స్‌ మాఫియా అంతర్జాతీయంగా విస్తరించి పనిచేస్తోందని, మాదక ద్రవ్యాల బానిసలు ప్రపంచవ్యాపంగా ఉన్నారని గుర్తు చేసింది. వివిధ మత్తుపదార్థాలను ఏ రీతిలో కలిపి విక్రయిస్తున్నారో చెబుతూ 40 పేజీల తీర్పును వెలువరించింది. డ్రగ్స్‌ పరిమాణంపై కేంద్ర ప్రభుత్వం 2009లో జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను న్యాయస్థానం తిరస్కరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని