డిప్రెషన్‌లో ఉన్నారేమో ఈ లక్షణాలు గమనించండి!
డిప్రెషన్.. ఎంతటివారినైనా కుంగదీస్తుందనడానికి ఇటీవల బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఘటనే ఉదాహరణ. చాలా చలాకీగా ఉండే సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడంటే అసలు నమ్మేలా కనిపించదు. కానీ ఆరు నెలలుగా ఆయన డిప్రెషన్‌లో ఉన్నట్లు ఎవరైనా గుర్తించారా? ప్రేమ, ఆర్థిక పరిస్థితి, కుటుంబ...
డిప్రెషన్.. ఎంతటివారినైనా కుంగదీస్తుందనడానికి ఇటీవల బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పూత్ ఘటనే ఉదాహరణ. చాలా చలాకీగా ఉండే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడంటే అసలు నమ్మేలా కనిపించదు. కానీ ఆరు నెలలుగా ఆయన డిప్రెషన్‌లో ఉన్నట్లు ఎవరైనా గుర్తించారా? ప్రేమ, ఆర్థిక పరిస్థితి, కుటుంబ కలహాలు, వృతి ఇలా ఏ విషయంలోనైనా కష్టాలు వచ్చినప్పుడు కొంత మంది భరించలేరు. వాటి నుంచి బయటకు రాలేక లోలోపల బాధపడుతూ డిప్రెషన్‌కు గురవుతుంటారు. అలాంటి వారిని గుర్తించడం కష్టమే కానీ.. డిప్రెషన్‌లోకి వెళ్తున్నారనడానికి కొన్ని లక్షణాలు ప్రామాణికంగా తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో మీరే చదవండి..
ఆకస్మిక మార్పు గమనించారా?
మీ ప్రియమైన వ్యక్తుల గురించి, వారి దినచర్య గురించి మీకు బాగా తెలుసు. ఎప్పుడు వారికి కోపం వస్తుంది? ఎప్పుడెలా ప్రవర్తిస్తారో అన్ని విషయాలు తెలుసు అనుకుందాం. కానీ, వారిలో అకస్మాత్తుగా మార్పులు రావడం.. కాస్త విభిన్నంగా ప్రవర్తించడం.. వారి భావోద్వేగాల్లో మార్పులు గమనిస్తే.. జాగ్రత్త వహించండి. వారిని డిప్రెషన్‌లోకి వెళ్లకుండా చూడండి.
మాట్లాడటం మానేస్తున్నారా?
డిప్రెషన్‌లో ఉన్నవాళ్లు ఎదుటివాళ్లతో మాట్లాడటానికి పెద్దగా ఇష్టపడరు. ఏదైనా ప్రశ్నించినా.. పలకరించినా నామమాత్రంగా సమాధానం చెప్పేసి తప్పించుకుంటారు. అలాంటప్పుడు వారికి ఏదో మూడ్ బాగోలేదేమో అని ఊరుకోవద్దు. వారిని ఓ కంట కనిపెట్టండి. కొంత మంది బాగా మాట్లాడుతున్నా.. మనసులో చాలా మథన పడుతుంటారు. వారిని గుర్తించడం మహా కష్టం.
నిద్రపట్టట్లేదని ఫిర్యాదులా?
నిద్ర పట్టకపోవడానికి చాలా కారణాలు ఉండొచ్చు. కానీ, ఎవరైనా నిద్ర పట్టట్లేదని పదే పదే చెబుతున్నారా? ఎంత నచ్చజెప్పినా, శాంత పర్చినా నిద్రపోవట్లేదా? పడుకున్న వెంటనే నిద్ర లేస్తున్నారా? నిద్రాభంగం ఎక్కువగా ఉంటే డిప్రెషన్‌లో ఉన్నట్టే. అలాంటి వారికి తగిన కౌన్సెలింగ్ ఇప్పించి సాధారణ స్థితికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి.
సరిగా తినట్లేదా?
అసలు తినకపోయినా.. ఎక్కువగా తినేస్తున్నా.. ఆందోళనలో ఉన్నట్లు అర్థం. అది డిప్రెషన్‌గా మారి తినే అలవాటులో మార్పులు తీసుకొస్తుంది. మీ ప్రియమైన వ్యక్తుల్లో తినే విధానంలో మార్పు గమనిస్తే.. వారిపై శ్రద్ధ వహించండి.
ఎక్కువగా చిరాకు పడుతున్నారా?
మీకు తెలిసిన వారు చేసే చర్యల్లో ఆవేశం ఎక్కువగా కనిపించినా.. ప్రతి చిన్న విషయానికి చిరాకు పడుతున్నా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరముంది. తరుచూ కనిపించే లక్షణమే అయినా.. కొందరు చిన్న చిన్న సమస్యలను సైతం తీవ్రంగా ఆలోచిస్తుంటారు. ఈ క్రమంలో ప్రతి దానికి చిరాకు పడుతుంటారు.
ప్రతికూలంగా ఆలోచిస్తున్నారా?
ఎవరైనా ఎక్కువగా ప్రతికూల ఆలోచనలతో సతమతమవుతుంటే వారు తొందరగా డిప్రెషన్‌లోని వెళ్లే అవకాశముంది. మీకు ప్రియమైన వ్యక్తులు ప్రతి విషయాన్ని ప్రతికూలంగా ఆలోచిస్తున్నట్లయితే వారి ఏకాగ్రతను మంచి విషయాలపైకి మరల్చండి. అలాంటి ఆలోచనల నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. అదీ కుదరకపోతే.. కౌన్సెలింగ్ ఇప్పించి మామూలు స్థితికి తీసుకురావొచ్చు.
ఆత్మవిశ్వాసం కోల్పోయినట్టుగా ఉన్నారా?
డిప్రెషన్‌లో ఉన్నవాళ్లలో వారిపై వారికి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. నమ్మకం కోల్పోతారు. ఆశావాదం ఉండదు. ఆత్మనూన్యతతో బాధపడుతుంటారు. అలాంటి వారికి ధైర్యం చెప్పి ఆత్మవిశ్వాసం కలిగేలా చేయాలి. తద్వారా డిప్రెషన్ నుంచి బయట పడే అవకాశముంది.
- ఇంటర్నెట్ డెస్క్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/03/2023)
-
Movies News
Dil Raju: ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌కు దిల్‌రాజు కానుకలు
-
India News
IAF chief: అంతరిక్షంపై భారత్ పట్టు సాధించాలి: వాయుసేన చీఫ్
-
Movies News
Rashmika: అప్పుడు విమర్శలు ఎదుర్కొని.. ఇప్పుడు రక్షిత్‌కి క్రెడిట్ ఇచ్చి
-
India News
Amritpal Singh: అరెస్టైనవారికి సాయం చేస్తాం: అకాలీదళ్
-
World News
Prince Harry: ప్రిన్స్ హ్యారీకి అమెరికా ‘బహిష్కరణ’ ముప్పు..!