మద్యం మత్తులో యువకుడి వీరంగం

చిత్తూరు జిల్లా తిరుపతిలో రైల్వే స్టేషన్‌ ఎదుట మద్యం మత్తులో ఓ యువకుడు వీరంగం...

Updated : 29 Jun 2020 14:07 IST

తిరుపతి :  చిత్తూరు జిల్లా తిరుపతిలో రైల్వే స్టేషన్‌ ఎదుట మద్యం మత్తులో ఓ యువకుడు హంగామా సృష్టించాడు. ప్లెక్సీ బారికేడ్‌ ఎక్కిన యువకుడు వేలాడుతూ జనాలను భయపెట్టాడు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది  అతడ్ని కిందకు దింపేదుకు ప్రయత్నించినప్పటికీ.. ఆ వ్యక్తి అక్కడి నుంచి ఒక్కసారిగా కిందికి దూకేశాడు. పోలీసులు అప్రమత్తంగా ఉండడంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు.ఆ యువకుడిది తమిళనాడులోని  కుంభకోణం ప్రాంతంగా  గుర్తించారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని