కొవిడ్‌-19కు మరో ఔషధం

కొవిడ్‌-19 చికిత్సకు హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాసూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (నైపర్‌) సంస్థ నెబులైజర్‌ ఆధారిత మందును తయారుచేసింది. లైఫ్‌ యాక్టివస్‌, సుప్రీం ఇండస్ట్రీస్‌తో ...

Published : 12 Sep 2020 09:39 IST

జంతువులపై ప్రయోగం విజయవంతం
నైపర్‌ సంస్థ ప్రకటన

హైదరాబాద్‌: కొవిడ్‌-19 చికిత్సకు హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాసూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (నైపర్‌) సంస్థ నెబులైజర్‌ ఆధారిత మందును తయారుచేసింది. లైఫ్‌ యాక్టివస్‌, సుప్రీం ఇండస్ట్రీస్‌తో కలిసి సంయుక్తంగా లైఫ్‌ వైరోట్రీట్‌ అనే ఈ ఔషధాన్ని తయారు చేసినట్లు నైపర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ శశిబాలాసింగ్‌ ప్రకటించారు. లైఫ్‌ యాక్టివస్‌ ఎండీ డాక్టర్‌ కేశవ్‌ డియో, సుప్రీం ఇండస్ట్రీస్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పంచసర, నైపర్‌ డీన్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌తో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈ మందును గత నాలుగు నెలల్లో వివిధ రకాల జంతువులపై ప్రయోగించగా విజయవంతంగా పనిచేస్తోందని తెలిపారు. క్లినికల్‌ ట్రయల్స్‌, మందు తయారీకి సంబంధించి ఇప్పటికే డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) ఆమోదం లభించిందన్నారు. క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతమైతే ఈ ఔషధాన్ని కొవిడ్‌-19 వైరస్‌ సోకిన వారితో పాటు ముందస్తుగా కూడా వినియోగించుకునే వీలుంటుందని చెప్పారు.

‘రక్తంలో ఆక్సిజన్‌ను పెంచుతుంది’
ఫ్లూ, శ్వాసకోశ వైరల్‌ ఇన్‌ఫెక్షన్లపై ఈ మందు పనిచేస్తుందని శశిబాలాసింగ్‌ పేర్కొన్నారు. రక్తంలో ఆక్సిజన్‌ శాతాన్ని పెంచేందుకు బాగా ఉపకరిస్తుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని