Fire accident: మంటలార్పే రోబోలు ఎప్పుడొస్తాయ్?
పరిశ్రమలు, ఎయిర్‌పోర్టుల భద్రతలో కీలకంగా వ్యవహరించే సీఐఎస్‌ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) మంటలార్పడంలో అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకుంటుండగా..
అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోని అగ్నిమాపకశాఖ
మంటలు ఆర్పడానికి సీఐఎస్‌ఎఫ్ వినియోగిస్తున్న డ్రోన్
ఈనాడు, హైదరాబాద్: పరిశ్రమలు, ఎయిర్‌పోర్టుల భద్రతలో కీలకంగా వ్యవహరించే సీఐఎస్‌ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) మంటలార్పడంలో అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకుంటుండగా.. అగ్నిమాపక విభాగం మాత్రం ఆపసోపాలు పడుతోంది. తాజాగా సికింద్రాబాద్ ‘స్వప్నలోక్’ ఘటనే ఇందుకు నిదర్శనం. ఐదో అంతస్తులో మంటలు చెలరేగితే మంటలు ఆర్పేందుకు సిబ్బంది శతవిధాలుగా ప్రయత్నించినా తొలుత ఒత్తిడి సరిపోక నీరు అక్కడి వరకు చేరుకోలేదు.
ఫైర్ ఫైటింగ్‌కు: మంటలను ఆర్పడంలో సమయం పెరుగుతున్న కొద్దీ నష్ట తీవ్రత అంతేస్థాయిలో ఉంటుంది. మానవ జోక్యానికి బదులు అత్యాధునిక సాంకేతికను ఉపయోగిస్తే ఈ సమయ పరిధిని, ప్రాణ, ఆస్తి నష్టాన్ని చాలా వరకు తగ్గించొచ్చు. దిల్లీలో ఫైర్‌ఫైటింగ్ రోబోలను ఎప్పటి నుంచో ఉపయోగిస్తున్నారు. అక్కడి బద్లీ ప్రాంతంలో ఓ గోదాంలో మంటలు చెలరేగినప్పుడు ఆర్పడం పెను సవాల్‌గా మారింది. ఆ సమయంలో రోబో ఫైర్‌ఫైటర్ వేగంగా నీళ్లు చల్లి మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. ఈ రోబోలను 300 మీటర్ల దూరం నుంచి రిమోట్ కంట్రోల్‌తో నడపొచ్చు. ఇవి గంటకు 4కిలోమీటర్ల వేగంతో కదులుతాయి. 100 మీటర్ల నుంచి నిమిషానికి 2400 లీటర్ల నీటిని అధిక పీడనంతో విరజిమ్మి ఆర్పేస్తుంది. ఇంట్లో ఎవరైనా చిక్కుకుని ఉంటే రోబో కెమెరాతో గుర్తించొచ్చు. అవసరమైతే ఈ రోబోలు కిటికీలను పగలగొట్టి లోనికి ప్రవేశిస్తాయి. భవనాల్లో మెట్లను ఎక్కి ప్రమాద స్థలికి చేరుకుంటాయి.
ప్రతిపాదనలకే పరిమితం...
రోబోటిక్ ఫైరింజన్ వ్యవస్థ, 90 నుంచి 100 మీటర్ల ఎత్తు వరకు వెళ్లే నాలుగు స్కైలిఫ్టులను కొనుగోలు చేయాలని అగ్నిమాపకశాఖ అధికారులు భావించినా అవి కేవలం ప్రతిపాదనలకే పరిమితం అయ్యాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Tollywood: శ్రీరామ నవమి స్పెషల్.. సందడి చేస్తోన్న కొత్త పోస్టర్లు
-
Crime News
Crime News: లైంగిక వాంఛ తీర్చాలని అర్ధరాత్రి వేధింపులు.. కత్తితో పొడిచి చంపిన యువతి
-
India News
పండగ వేళ విషాదం.. ఆలయంలో మెట్లబావిలో పడిన భక్తులు
-
General News
Sri Rama Navami: భద్రాచలంలో వైభవంగా రాములోరి కల్యాణోత్సవం
-
India News
Shashi Tharoor: నిర్మలాజీ.. మీరు గ్రేట్.. ఆ పాప కోసం రూ. ఏడు లక్షలు వదిలేశారు!
-
Crime News
Tanuku: శ్రీరామనవమి వేడుకల్లో అపశ్రుతి.. దగ్ధమైన చలువ పందిరి