మోదీ హయాంలో తెలంగాణకు ప్రాధాన్యం: కిషన్‌రెడ్డి

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రసంగించారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు రాష్ట్రాల వాటా 32 శాతం మాత్రమే ఉండేదని తెలిపారు.

Updated : 17 Jun 2023 12:46 IST

హైదరాబాద్‌: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రసంగించారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు రాష్ట్రాల వాటా 32 శాతం మాత్రమే ఉండేదని తెలిపారు. మోదీ ప్రభుత్వం రాగానే 32 నుంచి 42 శాతం పన్నుల వాటాను పెంచినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన వాటా నిధులు 1.78 లక్షల కోట్లు అని తెలిపారు. రీజినల్ రింగ్ రోడ్డు కోసం రూ.21,201 కోట్లు కేటాయించినట్లు వివరించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం రూ.715కోట్లు, చర్లపల్లి టెర్మినల్ అభివృద్ధి కోసం రూ.221కోట్లు, ఎంఎంటీస్‌ సెకండ్ ఫేజ్‌ కోసం కేంద్రం రూ.1,153 కోట్లు ఖర్చు చేసినట్లు కిషన్‌రెడ్డి చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని