GHMC: హైదరాబాద్‌లో హై అలర్ట్‌ ప్రకటించిన జీహెచ్‌ఎంసీ

జంట నగరాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున హైదరాబాద్‌ వాసులను జీహెచ్‌ఎంసీ అప్రమత్తం చేసింది.

Updated : 26 Jul 2023 17:43 IST

హైదరాబాద్‌: జంట నగరాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున హైదరాబాద్‌ వాసులను జీహెచ్‌ఎంసీ అప్రమత్తం చేసింది. ఈ మేరకు నగరంలో హై అలర్ట్‌ ప్రకటించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించింది. సహాయం కోసం 9000113667 నంబర్‌ను సంప్రదించాలని తెలిపింది. 70లక్షల మందిని ఎస్‌ఎంఎస్‌ల ద్వారా అప్రమత్తం చేసింది.

ఆగస్టు 1 వరకు 3 విడతల్లో లాగ్‌అవుట్‌

మరోవైపు, నగరంలో భారీ వర్ష సూచన నేపథ్యంలో.. ఐటీ ఉద్యోగుల పని వేళల్లో మార్పులను ఈ నెల 27 నుంచి వచ్చే నెల 1 వరకు కొనసాగించాలని సైబరాబాద్ పోలీసులు సూచించారు. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పరకుండా.. 3 దశలుగా విధుల ముగింపు వేళలు ఉండాలని పేర్కొంది.

ఫేజ్‌-1 మధ్యాహ్నం 3 గంటలకు.. : ఐకియా నుంచి సైబర్‌ టవర్స్‌ దారిలోని సంస్థలు, రహేజా మైండ్‌స్పేస్‌లోని కంపెనీలు, టీసీఎస్‌, హెచ్‌ఎస్‌బీసీ, డెల్‌, ఫీనిక్స్‌, ఒరాకిల్‌, క్వాల్‌కామ్‌, టెక్‌ మహీంద్ర, పూర్వా సమ్మిట్‌లోని కంపెనీలు.

ఫేజ్‌-2 సాయంత్రం 4 గంటలకు.. : ఐకియా, బయోడైవర్సిటీ, రాయదుర్గం సమీప ప్రాంతాల్లోని నాలెడ్జ్‌ సిటీ, నాలెడ్జ్‌ పార్క్‌, టీహబ్‌, గెలాక్సీ, ఎల్‌టీఐ అండ్‌ ట్విట్జా, కమర్జోమ్‌, ఆర్‌.ఎం.జడ్‌ నెక్సిటీ, స్కైవ్యూ, దివ్యశ్రీ ఓరియన్‌, అసెండాస్‌, ఇతర కంపెనీలు.

ఫేజ్‌-3 మధ్యాహ్నం 3-6 గంటల మధ్య: మైక్రోసాఫ్ట్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, సెంటారస్‌, బ్రాడ్‌వే, విర్టుసా, బీఎస్‌ఆర్‌ ఐటీపార్క్‌, ఐసీఐసీఐ, వేవ్‌రాక్‌, అమెజాన్‌, హనీవెల్‌, హిటాచీ, సత్వా క్యాపిటల్‌, క్యాప్‌ జెమిని, ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌, క్యూసిటీ, డీఎల్‌ఎఫ్‌, ఇతర ఐటీ పార్కుల్లోని కంపెనీలు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని