GHMC: సహాయ కార్యక్రమాలకు జీహెచ్‌ఎంసీ హెల్ప్‌లైన్‌

నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కొనసాగుతోంది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, అమీర్‌పేట, బోరబండ, కూకట్‌పల్లి, మాదాపూర్‌, ఫిల్మ్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో లోతట్టు కాలనీలు జలమయం అయ్యాయి.

Updated : 20 Jul 2023 10:16 IST

హైదరాబాద్‌: నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కొనసాగుతోంది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, అమీర్‌పేట, బోరబండ, కూకట్‌పల్లి, మాదాపూర్‌, ఫిల్మ్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో లోతట్టు కాలనీలు జలమయం అయ్యాయి. చాలా చోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో సహాయ కార్యక్రమాల కోసం హెల్ప్‌లైన్‌ నంబర్‌ 9000113667ను సంప్రదించాలని అధికారులు సూచించారు.

అత్యవసరమైతేనే బయటకు వెళ్లండి: మేయర్‌ 

భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులను మేయర్ గద్వాల విజయలక్ష్మి అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో డీఆర్‌ఎఫ్‌ టీంలు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. శిథిలావస్థ భవనాల్లో ఉన్న వారిని తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని నగర వాసులకు మేయర్‌ విజ్ఞప్తి చేశారు. 

తెలంగాణలో ఇవాళ, రేపు విద్యాసంస్థలకు సెలవు

ఇవాళ, రేపు భారీ వర్షాలు

ఉపరితల ఆవర్తనం, షియర్‌ జోన్‌ ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని పేర్కొంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని