Yadadri: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారి రథానికి బంగారు కవచాల వితరణ

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి స్వర్ణ రథం సిద్ధమైంది. హైదరాబాద్‌కు చెందిన శ్రీ లోగిళ్లు ల్యాండ్ మార్క్ డెవలపర్స్ సంస్థల ఆధ్వర్యంలో

Updated : 12 Mar 2022 12:24 IST

యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి స్వర్ణ రథం సిద్ధమైంది. హైదరాబాద్‌కు చెందిన లోగిళ్లు ల్యాండ్ మార్క్ డెవలపర్స్ సంస్థల ఆధ్వర్యంలో చెన్నైలో రూపొందించిన స్వర్ణ కవచాలను టేకు రథానికి అమర్చారు. పసిడి శోభ సంతరించుకున్న రథానికి.. దాతలు తమ కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం రాత్రి బాలాలయంలో పూజలు చేశారు. అనంతరం దేవస్థానం ఈవో గీత, ప్రధాన పూజారి లక్ష్మీ నరసింహచార్యులకు అప్పగించారు. సుమారు రూ.75 లక్షల విలువైన బంగారంతో కవచాలు తయారు చేయించామని దాతలు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ రాత్రి బాలాలయంలో చేపట్టనున్న రథోత్సవంలో.. పుత్తడి రథంపై యాదాద్రీశుడు భక్తులకు దర్శనమివ్వనున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని