
బార్లు.. దరఖాస్తుల బారులు
ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణలో నూతన బార్ల ఏర్పాటుకు పోటీ భారీగా పెరిగింది. ఇప్పుడున్న వాటికి అదనంగా 159 కొత్త బార్ల ఏర్పాటు కోసం 7360 దరఖాస్తులు వచ్చాయి. సోమవారం దరఖాస్తులకు చివరి రోజు కావడంతో ఒక్కరోజే 5311 అప్లికేషన్లు వచ్చాయి. అత్యధికంగా యాదగిరిగుట్టలో ఒక్క బార్‌కు 277 దరఖాస్తులు రాగా సూర్యాపేట జిల్లా నేరేడ్‌చర్లలో 249 అప్లికేషన్లు వచ్చాయి. అయితే బోధన్‌లో మూడు బార్లకు కేవలం మూడు మాత్రమే వచ్చాయి. వ్యాపారులు సిండికేట్ అయ్యి ఇలా చేసినట్లు అబ్కారీ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 55 బార్లకు 1,053 దరఖాస్తులు వచ్చాయి. ఈనెల 10న ఆయా జిల్లాల్లో కలెక్టర్ల నేతృత్వంలో లాటరీ విధానంలో లైసెన్సుదారుల ఎంపిక జరగనుంది.
ఇవీ చదవండి...
ప్రభుత్వాసుపత్రికి ఉయ్యాలలు.. కేటీఆర్ ప్రశంసలు
పెళ్లి చేసుకుంటానని కాటికి పంపిన ప్రేమికుడు
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.