YS Bhaskar Reddy: వైఎస్‌ భాస్కర్‌ రెడ్డికి మధ్యంతర బెయిల్‌

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వైఎస్‌ భాస్కర్‌ రెడ్డికి మధ్యంతర బెయిల్‌ మంజూరైంది.

Updated : 08 Nov 2023 18:24 IST

హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వైఎస్‌ భాస్కర్‌ రెడ్డికి మధ్యంతర బెయిల్‌ మంజూరైంది. నవంబర్‌ 30 వరకు ఆయనకు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్‌ను సీబీఐ కోర్టు మంజూరు చేసింది. డిసెంబర్‌ 1న ఉదయం 10.30 గంటలకు చంచల్‌గూడ జైలుకు వెళ్లాలని ఆదేశించింది. అలాగే కోర్టులో భాస్కర్‌రెడ్డి తన పాస్‌పోర్టును సరెండర్‌ చేయడంతో పాటు తన చిరునామా వివరాలు కోర్టు, సీబీఐకి ఇవ్వాలని స్పష్టం చేసింది. చికిత్సకు వెళ్లాల్సి వస్తే ఆ వివరాలను సీబీఐకి తెలపాలని షరుతుల్లో పేర్కొంది. కుటుంబసభ్యులను తప్ప మిగతా ఎవరినీ కలవొద్దని తెలిపింది. సెప్టెంబర్‌ 20 నుంచి వైఎస్‌ భాస్కర్‌రెడ్డి ఎస్కార్ట్‌ బెయిల్‌పై ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ  బెయిల్‌ను మధ్యంతర బెయిల్‌గా మారుస్తూ సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని