Madhya Pradesh: ‘ఏదో అదృశ్యశక్తి నా ఆహారాన్ని దొంగిలిస్తోంది’

మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లాలో ఓ మహిళ ఒక విచిత్రమైన కేసుతో పోలీసుల ముందుకు వచ్చారు. ఏదో అదృశ్య శక్తి ఆమె దుస్తులు, నగదును కాజేయడమే కాకుండా.. నగల బరువునూ తగ్గిస్తోందని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించారు. ఆమె ప్రధానమంత్రి రూరల్ రోడ్ మిషన్‌లో...

Updated : 06 Dec 2021 04:31 IST

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లాలో ఓ మహిళ ఒక విచిత్రమైన కేసుతో పోలీసుల ముందుకు వచ్చారు. ఏదో అదృశ్య శక్తి ఆమె దుస్తులు, నగదును కాజేయడమే కాకుండా.. నగల బరువునూ తగ్గిస్తోందని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించారు. ఆమె ప్రధానమంత్రి రూరల్ రోడ్ మిషన్‌లో సబ్ ఇంజినీర్ కావడం గమనార్హం. స్థానికంగా ఓ అధికారి ఈ విషయాన్ని ధ్రువీకరించారు. తన ఆహారాన్ని గుర్తుతెలియని శక్తి తినేస్తోందని, ఆభరణాల బరువునూ తగ్గిస్తోందంటూ ఆమె ఇటీవల కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వక ఫిర్యాదు చేసినట్లు స్టేషన్ ఇన్‌ఛార్జి రత్నాకర్ హింగ్వే తెలిపారు. గత నాలుగైదు రోజులుగా జరుగుతున్న ఈ చోరీ వ్యవహారాన్ని పరిష్కరించాలంటూ అందులో పేర్కొన్నారని చెప్పారు.

అయితే.. ఈ వ్యవహారంలో ఎటువంటి అదృశ్య శక్తుల పాత్ర లేదని పోలీసులు తోసిపుచ్చారు. ఆమె మానసిక సమస్యలతో బాధపడుతున్నారని, ఈ మేరకు కౌన్సెలింగ్ కోసం సైకియాట్రిస్ట్‌ వద్దకు పంపుతామని తెలిపారు. ఆభరణాల బరువు.. వాటి వినియోగం కారణంగా క్రమంగా అతి స్వల్ప మొత్తంలో తగ్గుతూ వస్తుందనేది దాదాపు అందరికి తెలిసిన విషయమేనని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని