KCR: నన్ను చూసేందుకు రావొద్దు.. పార్టీ శ్రేణులు, అభిమానులకు కేసీఆర్‌ విజ్ఞప్తి

తనను పరామర్శించేందుకు ఎవరూ యశోద ఆసుపత్రికి రావొద్దని భారాస (BRS) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (KCR) విజ్ఞప్తి చేశారు.

Updated : 12 Dec 2023 17:57 IST

హైదరాబాద్‌: తనను పరామర్శించేందుకు ఎవరూ యశోద ఆసుపత్రికి రావొద్దని భారాస (BRS) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (KCR) విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఆయన మంగళవారం వీడియో సందేశం విడుదల చేశారు. ‘‘10 రోజుల వరకు నన్ను కలిసేందుకు ఎవరూ రావొద్దు. ఆసుపత్రిలో వందలాది మంది రోగులకు ఇబ్బంది కలగకూడదు. ఇన్‌ఫెక్షన్‌ సోకే ప్రమాదం ఉన్నందున ఎవరూ రావొద్దని వైద్యులు చెప్పారు. నేను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. త్వరలో సాధారణ స్థితికి చేరుకుని మీ మధ్యకు వస్తా.  కోలుకున్న తర్వాత తప్పకుండా ప్రతి ఒక్కరినీ కలుస్తా. నా పట్ల అభిమానం చూపుతున్న కోట్లాది ప్రజలకు కృతజ్ఞతలు. దయచేసి సహకరించండి’’ అని పార్టీ శ్రేణులు, అభిమానులకు కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని