బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న కిష్‌న్‌రెడ్డి

ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి దర్శించుకున్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయం ప్రారంభోత్సవానికి విజయవాడ వచ్చిన ఆయన ఆదివారం ..

Published : 25 Oct 2020 08:47 IST

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి దర్శించుకున్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయం ప్రారంభోత్సవానికి విజయవాడ వచ్చిన ఆయన ఆదివారం ఉదయం అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో అధికారులు కిషన్‌రెడ్డికి స్వాగతం పలికారు. కరోనా మహమ్మారిపోయి ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా దీవించాలని దుర్గమ్మను వేడుకున్నట్టు కిషన్‌రెడ్డి తెలిపారు. కేంద్రమంత్రి వెంట ఎంపీ జీవీఎల్‌, ఎమ్మెల్సీ మాధవ్‌, విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి దుర్గగుడి ఈవో సురేశ్‌బాబు వినతిపత్రం సమర్పించారు. ప్రసాదం పథకం కింద రూ.85 కోట్లు మంజూరు చేయాలని కోరారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని