కోర్టులో చోరీ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలి: నెల్లూరులో న్యాయవాదుల నిరసన

నెల్లూరు కోర్టు భవనాల సముదాయం వద్ద న్యాయవాదులు నిరసన చేపట్టారు. న్యాయ వ్యవస్థను కాపాడాలంటూ నినాదాలు చేశారు.

Updated : 16 Apr 2022 12:55 IST

నెల్లూరు: నెల్లూరు కోర్టు భవనాల సముదాయం వద్ద న్యాయవాదులు నిరసన చేపట్టారు. న్యాయ వ్యవస్థను కాపాడాలంటూ నినాదాలు చేశారు. దొంగలబారి నుంచి న్యాయస్థానాన్ని రక్షించాలని కోరారు. దోషులను వెంటనే శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఇద్దరిని అరెస్టు చేశామని పోలీసులు చెబుతున్నారని న్యాయవాదుల తెలిపారు. ‘‘అనామక దొంగలను అరెస్టు చేయడం కాదు. చోరీకి పాల్పడిన అసలు దొంగలను అరెస్టు చేయాలి. కాకాణి ముద్దాయిగా ఉన్న కేసు ప్రాపర్టీ చోరీకి గురైంది. వందల కేసులు ఉండగా ఈ ఒక్క కేసు పత్రాలే ఎందుకు దొంగిలించారు. చోరీ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలి. భారతదేశ చరిత్రలో ఇలాంటి చోరీ జరగలేదు. కేసు పత్రాలు దొంగిలించడం దుర్మార్గమైన చర్య. కోర్టులోనే చోరీ జరిగితే.. ప్రజలు ఎవరి వద్దకు వెళ్లాలి’’ అని న్యాయవాదులు ప్రశ్నించారు.

నెల్లూరు కోర్టు సముదాయంలోని 4వ అదనపు జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో బుధవారం అర్ధరాత్రి కొందరు వ్యక్తులు చొరబడ్డారు. గురువారం ఉదయం కోర్టుకు వచ్చిన సిబ్బంది దొంగతనం జరిగినట్టు గుర్తించారు. నెల్లూరుకు చెందిన ఓ ప్రజాప్రతినిధి కేసులో పత్రాలు, స్టాంపులు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు ఇతర పరికరాలున్న సంచి అపహరణకు గురైనట్లు కోర్టు బెంచి క్లర్క్​స్థానిక చిన్నబజారు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని