తేలియాడుతూ చదువుకోవచ్చు

ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ పుస్తక పఠనం చేసేలా పడవలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసింది బెంగాల్‌ ప్రజారవాణా సంస్థ. కోల్‌కతాలోని హుగ్లీ నదిలో పడవ గ్రంథాలయాన్ని ప్రారంభించింది...

Published : 31 Jan 2021 16:26 IST

పడవలో గ్రంథాలయం ఏర్పాటు

కోల్‌కతా: ప్రశాంత వాతావరణంలో పుస్తకాలను చదువుతూ పుస్తకప్రియులు కాలాన్నే మరిచిపోతారు. అలాంటి వారి ఆనందాన్ని రెట్టింపు చేసేందుకు వినూత్న ఆలోచన చేసింది బెంగాల్‌ ప్రజారవాణా సంస్థ. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ పుస్తక పఠనం చేసేలా పడవలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసింది. కోల్‌కతాలోని హుగ్లీ నదిలో పడవ గ్రంథాలయాన్ని ప్రారంభించింది. విభిన్న రీతిలో ఏర్పాటుచేసిన ఈ తేలియాడే లైబ్రరీలో అనేక రకాల పుస్తకాలను అందుబాటులో ఉంచారు. పెద్దల కోసమే కాకుండా పిల్లల కోసం కూడా పుస్తకాలను ఏర్పాటుచేశారు. చదవాలనే ఆసక్తి ఉన్నవారు ఎవరైనా ఈ లైబ్రరీలోకి ఆహ్వానితులేనని నిర్వాహకులు పేర్కొంటున్నారు.

ఈ పడవలో చదువుకునేందుకు పెద్దలకు రూ.100, చిన్నారులకు రూ.50 రుసుముగా నిర్ణయించారు. గ్రంథాలయంలో ప్రస్తుతం 500 పుస్తకాలు ఉండగా రానున్న రోజుల్లో మరో 500 పుస్తకాలను ఏర్పాటుచేసేందుకు బెంగాల్‌ ప్రజా రవాణా శాఖ ఏర్పాట్లు చేస్తోంది. నదీ ప్రవాహాన్ని ఆనందిస్తూ.. ప్రకృతి అందాలను తిలకిస్తూ పర్యాటకులు పుస్తకాలను చదువుకోవచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. రోజులో మూడు ట్రిప్పులు మాత్రమే ఉంటాయని, గ్రంథాలయాన్ని సోమవారం నుంచి శుక్రవారం వరకే నడపనున్నట్లు పేర్కొన్నారు. అందులో ఉచిత వైఫై ఏర్పాటుచేసినట్లు వెల్లడించారు. ఈ తేలియాడే గ్రంథాలయంలో త్వరలో సాహిత్య కార్యక్రమాలను కూడా నిర్వహించనున్నట్లు రవాణాశాఖ పేర్కొంది.

ఇవీ చదవండి...

ఈ పుస్తకం మనిషిని చంపేస్తుంది!

ఈ బండరాయి ఎంత కదిపినా కదలదు!!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని