
చాంతాడంత చలాన్
కరీంనగర్: భారీగా చలాన్ పెండింగ్ ఉన్న ఓ వ్యక్తిని కరీంనగర్లో పోలీసులు పట్టుకున్నారు. కరీంనగర్ పట్టణంలోని ఓ వ్యక్తికి చెందిన ద్విచక్రవాహనంపై 54 చలాన్లకు సంబంధించి ₹15,884లను పోలీసులు కట్టించుకున్నారు. అతి పొడవైన చలాన్ రసీదును చూపించారు. ఈ చలాన్ల నుంచి తప్పించుకునేందుకు కొందరు వాహనదారులు నంబర్ ప్లేట్ల ట్యాంపరింగ్, నంబర్ ప్లేట్లను తీసివేయడం, తప్పుడు నంబర్ ప్లేట్లతో తిరుగుతున్నారన్న సమాచారంతో ఎల్ఎండీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నంబర్ ప్లేట్లు లేని 25 వాహనాలపై పెండింగ్లో ఉన్న ₹65,975లను వాహనదారుల నుంచి కట్టించుకున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.