KTR: ఐటీ ఉత్పత్తుల నుంచి ఆహార ఉత్పత్తుల వరకు అద్భుత పురోగతి: కేటీఆర్‌

తెలంగాణలో సమగ్ర, సమీకృత, సమతుల్య అభివృద్ధి జరుగుతోందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ రాబోయే ఎన్నికల కోసం కాకుండా.. రేపటితరం కోసం పని చేస్తారని ఆయన చెప్పారు. 

Updated : 06 Jun 2023 16:44 IST

హైదరాబాద్‌: ఐటీ ఉత్పత్తుల నుంచి ఆహార ఉత్పత్తుల దాకా అద్భుత పురోగతితో తెలంగాణలో (Telangana) అరుదైన దృశ్యాలు ఆవిష్కృతమవుతున్నాయని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ (KTR) తెలిపారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా యాదాద్రి జిల్లా దండు మల్కాపూర్‌ గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్కులో జరిగిన పారిశ్రామిక ప్రగతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నైపుణ్య అభివృద్ధి కేంద్రం, కామన్‌ ఫెసిలిటీ సెంటర్‌, వ్యర్థాల శుద్ధి కేంద్రం, పారిశ్రామిక వేత్తల సమాఖ్య కార్యాలయాలను మంత్రి జగదీశ్‌ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఏకకాలంలో 51 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్ని ప్రారంభించిన మంత్రులు.. చిన్నారుల కోసం బొమ్మలు తయారు చేసేందుకు ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్న తెలంగాణ టాయ్స్‌ పార్కుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సమగ్ర, సమీకృత, సమతుల్య అభివృద్ధి జరుగుతోందని కేటీఆర్‌ తెలిపారు. రాబోయే ఎన్నికల కోసం కాకుండా రేపటితరం కోసం కేసీఆర్‌ పని చేస్తారన్న ఆయన...ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు