Prashanth Reddy: ‘గృహలక్ష్మి’ నిరంతర ప్రక్రియ.. గడువుతో ఆందోళన వద్దు: మంత్రి ప్రశాంత్‌రెడ్డి

‘గృహలక్ష్మి’ పథకం నిరంతర ప్రక్రియ అని.. దరఖాస్తుల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు.

Published : 09 Aug 2023 14:47 IST

హైదరాబాద్‌: ‘గృహలక్ష్మి’ పథకం నిరంతర ప్రక్రియ అని.. దరఖాస్తుల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. రేపటితో తొలి విడత గడువు ముగియనున్న నేపథ్యంలో మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. సొంత స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం రూ.3లక్షలు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారని.. ఈ పథకాన్ని నిరంతరాయంగా అమలు చేస్తామన్నారు. 

గ్రామకంఠంలో ఉన్న పాత ఇళ్లు, స్థలాలకు దస్తావేజు పేపర్లు ఉండవని.. ఇంటి నంబర్ లేకుంటే ఖాళీ స్థలం ఉన్నా దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి వివరించారు. దరఖాస్తు గడువు అయిపోయిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. దరఖాస్తుదారులు తమ ప్రజాప్రతినిధులతో జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తులు పంపించవచ్చని చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి ప్రస్తుతం మొదటి దశలో 3000 ఇళ్లు పూర్తయిన తర్వాత రెండో దశలో ఇచ్చే ‘గృహలక్ష్మి’ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. దశల వారీగా అర్హులైన పేదల ఇంటి నిర్మాణం కోసం ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని