Vemula: స్వయంపాలనలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు పూర్వ వైభవం: మంత్రి వేముల

తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు పూర్వ వైభవం తీసుకొచ్చామని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. 

Published : 26 Jul 2023 20:39 IST

నిజామాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు పూర్వ వైభవం తీసుకొచ్చామని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ముప్కాల్‌ పంప్‌ హౌస్‌ వద్ద 60 వసంతాల వేడుక నిర్వహించారు. మంత్రి ప్రశాంత్‌ రెడ్డి, సీఎం ఓఎస్డీ శ్రీధర్ రావు, ఈఎన్‌సీలు శంకర్, నాగేందర్, సీఈ సుధాకర్ రెడ్డి, ఇంజనీర్లు, రైతులు పాల్గొన్నారు. ప్రాజెక్టు వద్ద ఉన్న నెహ్రూ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. 

ప్రాజెక్టు గేట్ల పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌, ఆటో గేర్ వ్యవస్థను సైతం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంజినీర్లను మంత్రి సన్మానించారు. రూ.40 కోట్లతో 4 లక్షల ఎకరాల కోసం 1963 ఏడాదిలో ఎస్సారెస్పీని ప్రారంభించారని.. 1983లో రిజర్వాయర్‌ను పూర్తిగా నీటితో నింపారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టుల పట్ల అన్యాయం జరిగిందన్నారు. ఎస్సారెస్పీకి రివర్స్ పంపింగ్‌ ద్వారా నీళ్లు వస్తాయా? అన్న సందేహం వ్యక్తమైనా.. పునర్జీవ పథకం ద్వారా కాళేశ్వరం జలాలు శ్రీరాం సాగర్‌కు తీసుకొచ్చామని మంత్రి వేముల తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని