Telangana News: అమరుల త్యాగాలు ప్రతిబింబించేలా ఫినిషింగ్‌ ఉండాలి: ప్రశాంత్‌రెడ్డి

తెలంగాణ నూతన సచివాలయ పనుల పురోగతిని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పరిశీలించారు. అమరవీరులు స్మారకం పనులను పరిశీలించిన మంత్రి.. పనుల పురోగతిపై అధికారులకు పలు సూచనలు చేశారు. అమరుల స్మారకం నిర్మాణంపై అధికారులు...

Published : 28 May 2022 22:26 IST

హైదరాబాద్‌: తెలంగాణ నూతన సచివాలయ పనుల పురోగతిని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పరిశీలించారు. అమరవీరులు స్మారకం పనులను పరిశీలించిన మంత్రి.. పనుల పురోగతిపై అధికారులకు పలు సూచనలు చేశారు. అమరుల స్మారకం నిర్మాణంపై అధికారులు దృష్టి పెట్టాలని.. వారి త్యాగాలు ప్రతిబింబించేలా ఫినిషింగ్‌ ఉండాలన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నివాళులకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. సచివాలయ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని అధికారులు, గుత్తేదారులను ఆదేశించారు. సచివాలయ ఎలివేషన్‌, క్లాడింగ్ పనులు వేగంగా పూర్తి చేయాలని.. గ్రాండ్‌ ఎంట్రీ నిర్మాణం ఫినిషింగ్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అధికారులకు చెప్పారు. సీఎం కేసీఆర్ విధించిన నిర్ణీత గడువులోగా పనులు పూర్తి కావాలని ప్రశాంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని