మహమ్మారుల ఒత్తిడి.. వీరిపైనే ఎక్కువట..!

మహమ్మారులు తలెత్తినప్పుడు సమాజంలోని వివిధ వర్గాలవారు ఒత్తిడికి లోనవటం అనివార్యం.

Updated : 08 Feb 2021 04:35 IST

దిల్లీ: కరోనా వైరస్‌ వంటి వ్యాధులు, మహమ్మారులు విజృంభించినప్పుడు సమాజంలోని వివిధ వర్గాలవారు ఒత్తిడికి లోనవటం అనివార్యం. కాగా, వివిధ వృత్తుల్లో ఉన్నవారందరి కంటే.. మహిళా నర్సులు, వైద్యసేవల సిబ్బందిలో మానసిక సమస్యలు అధికమని ఓ అంతర్జాతీయ అధ్యయనంలో వెల్లడైంది. యూకేలోని యూనివర్సిటీ ఆఫ్‌ షెఫీల్డ్‌.. ప్రపంచ వ్యాప్తంగా లక్షా 43 వేల మంది గణాంకాలతో ఈ భారీ అధ్యయనాన్ని చేపట్టింది. కొవిడ్‌-19, సార్స్‌, బర్డ్‌ ఫ్లూ, ఎబోలా వంటి ఆరోగ్య పరమైన సవాళ్లు ఎవరిపై అధిక ప్రభావం చూపుతాయనే అంశంపై ఈ ప్రపంచ స్థాయి అధ్యయనం దృష్టిసారించింది. 

ఇందుకుగానూ జనాభా సంఖ్య, వయస్సు, వృత్తి తదితర సాంఘిక, మానసిక అంశాలను గురించి 2000 నుంచి 2020 వరకు సేకరించిన గణాంకాలను పరిగణనలోకి తీసుకుంది. ఈ క్రమంలో అందరికంటే మహిళా వైద్యారోగ్య సిబ్బంది అధిక ఒత్తిడికి గురయ్యారని.. వారిలోనే మహమ్మారుల వల్ల మానసిక సమస్యలు తలెత్తుతున్నాయిని వెల్లడైంది. మహిళలు కావడం, ప్రమాదకర వ్యాధులు సోకిన రోగులకు సమీపంగా గడపాల్సి రావటం, ఒత్తిడి తదితర కారణాలు ఈ పరిస్థితికి కారణమవుతున్నాయని.. ముఖ్య పరిశోధకురాలు ఫసియా సిరోయిస్‌ తెలిపారు.

ప్రస్తుతం కొనసాగుతున్న కొవిడ్‌కాలంలో.. వారిపై పడుతున్న అమిత ఒత్తిడిని తగ్గించే కారకాలను కనుగొనేందుకు ఈ శాస్త్రజ్ఞుల బృందం తమ పరిశోధలను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో మనిషి మెదడు, ప్రవర్తనల వెనుక ఉన్న శాస్త్రీయ అంశాలను అధ్యయనం చేస్తున్నామని.. త్వరలోనే విజయాన్ని సాధిస్తామని వారు ధీమా వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి..

విమానం టైర్ల దగ్గర వేలాడుతూ..

 కొవిడ్‌ టీకా.. 13 నుంచి రెండో డోసు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని