Hyderabad: మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ప్రధాని మోదీ

తెలంగాణలో ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. సికింద్రాబాద్‌లోని మహంకాళి అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు.

Updated : 05 Mar 2024 11:10 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. సికింద్రాబాద్‌లోని మహంకాళి అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. తొలుత ఆలయం వద్దకు చేరుకున్న ప్రధానికి అర్చకులు, వేదపండితులు ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు ఆయనకు అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఆలయ పరిసర ప్రాంతాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. మహంకాళి అమ్మవారి దర్శనం తర్వాత సంగారెడ్డి పర్యటనకు మోదీ బయల్దేరారు. బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్‌లో వెళ్లారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని