Viveka Murder Case: రాహుల్‌ దేవ్‌ శర్మ నుంచి వివరాలు సేకరించిన సీబీఐ

వివేకా హత్య సమయంలో కడప ఎస్పీగా ఉన్న రాహుల్‌ దేవ్‌ శర్మ హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయానికి వచ్చారు. కేసు వివరాలను అధికారులకు అందజేశారు.

Published : 24 Apr 2023 16:52 IST

హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య జరిగిన సమయంలో కడప ఎస్పీగా ఉన్న రాహుల్‌దేవ్‌ శర్మ హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో కేసు వివరాలు అందజేశారు. దాదాపు గంటపాటు సీబీఐ కార్యాలయంలో రాహుల్‌దేవ్‌ శర్మ ఉన్నారు. అధికారులు ఆయన్ను పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. వివేకాహత్య కేసులో గతంలో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)లోనూ రాహల్‌ దేవ్‌ సభ్యుడిగా ఉండటంతో గతంలో చోటు చేసుకున్న పరిణామాలపైనా ఆయన్ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. హత్యాస్థలంలో లభించిన ఆధారాలను అప్పటి ఎస్పీ రాహుల్‌ దేవ్‌కు కుటుంబ సభ్యులు అందజేశారు. వాటి గురించి కూడా సీబీఐ అధికారులు ఆరా తీసినట్లు సమాచారం.

భాస్కర్‌రెడ్డికి 29 వరకు జ్యుడిషియల్‌ రిమాండ్

మరోవైపు ఈ కేసులో అరెస్టయిన కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిల సీబీఐ కస్టడీ ఇవాళ్టితో ముగియడంతో.. వారిని అధికారులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం.. వైస్‌ భాస్కర్‌రెడ్డికి ఈ నెల 29 వరకు, ఉదయ్‌కుమార్‌ రెడ్డికి ఈ నెల 26 వరకు జ్యుడిషియలర్‌ రిమాండ్ విధించింది. వైద్య పరీక్షల అనంతరం తిరిగి వారిద్దరినీ చంచల్‌గూడ జైలుకు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని