SC Railway: రెయిన్‌ ఎఫెక్ట్‌... ఈనెల 13 వరకు పలు రైళ్లు రద్దు

భారీ వర్షాల దృష్ట్యా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై ఇన్‌ఛార్జి జనరల్‌ మేనేజర్‌ అరుణ్ కుమార్‌ జైన్‌ సికింద్రాబాద్‌లోని రైల్‌ నిలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో

Published : 12 Jul 2022 02:21 IST

హైదరాబాద్‌: భారీ వర్షాల దృష్ట్యా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై ఇన్‌ఛార్జి జనరల్‌ మేనేజర్‌ అరుణ్ కుమార్‌ జైన్‌ సికింద్రాబాద్‌లోని రైల్‌ నిలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ విభాగాల ఉన్నతాధికారులతో పాటు విజయవాడ, గుంతకల్‌, గుంటూరు, సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, నాందేడ్‌ డివిజినల్‌ రైల్వే మేనేజర్లు వెబ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. భారీ వర్షాల సమయంలో ట్రాక్‌ నిర్వహణకు సంబంధించి కచ్చితంగా తనిఖీలు చేపట్టాలని, రాత్రి సమయాల్లో కూడా పరిస్థితుల తీవ్రతను పర్యవేక్షించాలని అధికారులకు, పర్యవేక్షణ సిబ్బందికి జీఎం సూచించారు. రైళ్ల రాకపోకల సమయాల్లో మార్పులు ఉంటే ప్రయాణం చేసే వారికి తాజా సమాచారాన్ని రైల్వే స్టేషన్ల వద్ద నిరంతరం ప్రకటించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. ప్రమాదకర సెక్షన్లలో పరిస్థితులపై రోజువారీ నివేదికలు పంపాలని సిబ్బందిని ఆదేశించారు. 

ఈనెల 13వరకు పలు రైళ్లు రద్దు..

భారీ వర్షాల కారణంగా పలు రైళ్లు రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈనెల 11 నుంచి 13 వరకు సికింద్రాబాద్‌- ఉందానగర్‌-సికింద్రాబాద్‌ ప్యాసింజర్‌ రైలు, సికింద్రాబాద్‌-ఉందానగర్‌ మెము రైలు, మేడ్చల్‌-ఉందానగర్‌ మెము ప్రత్యేక రైలు, ఉందానగర్‌-సికింద్రాబాద్‌ మెము స్పెషల్‌ రైలు, సికింద్రాబాద్‌- ఉందానగర్‌ మెము స్పెషల్‌ రైలు, హెచ్‌.ఎస్‌ నాందేడ్‌- మేడ్చల్‌-హెచ్‌ఎస్‌ నాందేడ్‌, సికింద్రాబాద్‌- మేడ్చల్‌ మెము రైలు, మేడ్చల్‌-సికింద్రాబాద్‌ మెము రైలు, కాకినాడ పోర్టు-విశాఖపట్నం మెము రైలు, విజయవాడ- బిట్రగుంట మెము రైలును రద్దు చేసినట్టు దక్షిణ మద్య రైల్వే పేర్కొంది. 

34 ఎంఎంటీఎస్‌ సర్వీసులు రద్దు..

వర్షాల కారణంగా ఈనెల 11 నుంచి 13 వరకు 34 ఎంఎంటీఎస్‌ సర్వీసులు రద్దు చేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు. లింగంపల్లి-హైదరాబాద్‌ రూట్‌లో 9 సర్వీసులు, హైదరాబాగ్‌-లింగంపల్లి మార్గంలో 9, ఫలక్‌నుమా-లింగంపల్లి మధ్య 7 సర్వీసులు, లింగంపల్లి -ఫలక్‌నుమా రూట్‌లో 7 సర్వీసులు, సికింద్రాబాద్‌-లింగంపల్లి రూట్‌లో ఒకటి, లింగంపల్లి సికింద్రాబాద్‌ మార్గంలో ఒక సర్వీసు రద్దు చేశారు. ఉందానగర్- మేడ్చల్ మెము స్పెషల్, సికింద్రాబాద్-బొల్లారం మెము స్పెషల్, బొల్లారం-సికింద్రాబాద్ మెము స్పెషల్, మేడ్చల్-సికింద్రాబాద్ మెము స్పెషల్, సికింద్రాబాద్-మేడ్చల్ మెము స్పెషల్ రైళ్లను ఈనెల 11 నుంచి 13వ తేదీ వరకు రద్దు చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని