గర్భిణిని రక్షించిన రైల్వే పోలీసులు

రైల్వే పోలీసులు సమయస్ఫూర్తితో వ్యవహరించి ఓ గర్భిణి ప్రాణాలు కాపాడారు. జయ్‌ధన్‌రాయ్‌, బంధన్‌రాయ్‌ దంపతులు గౌహతి ఎక్సప్రెస్‌ రైలులో...

Published : 13 Nov 2020 14:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రైల్వే పోలీసులు సమయస్ఫూర్తితో వ్యవహరించి ఓ గర్భిణి ప్రాణాలు కాపాడారు. జయ్‌ధన్‌రాయ్‌, బంధన్‌రాయ్‌ దంపతులు గౌహతి ఎక్సప్రెస్‌లో బెంగళూరు వెళుతున్నారు. బంధన్‌రాయ్‌ నిండుగర్భిణి. తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట దాటిన తర్వాత బంధన్‌రాయ్‌కి పురుటినొప్పులు మొదలయ్యాయి. దీంతో రైలులోని వారు రైల్వే టోల్ ‌ఫ్రీం నంబర్‌కు సమాచారమందించారు. దీంతో రైలును తుని రైల్వేస్టేషన్‌లో నిలిపిన పోలీసులు ఆమెను ఆంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఆమెకు సుఖ ప్రసవం జరిగింది. బంధన్‌రాయ్‌కి మగ బిడ్డ జన్మించాడు. తల్లీబిడ్డా క్షేమంగా ఉండటంతో అందరూ సంతోషం వ్యక్తం చేశారు.
 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని