Rosaiah: బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు రోశయ్య ఏం మాట్లాడేవారంటే?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన రోశయ్య.. ఆర్థిక క్రమశిక్షణను విస్మరించలేదు.

Updated : 04 Dec 2021 15:50 IST

హైదరాబాద్‌: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన రోశయ్య.. ఆర్థిక క్రమశిక్షణను విస్మరించలేదు. డబ్బు వృథా చేయొద్దని చెప్పేవారు. డబ్బు ముడేయటమంటే.. చెడు కాదని అభిప్రాయపడేవారు. ఉమ్మడి ఏపీలో 15సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన నేతగా ఆయన గుర్తింపు సాధించారు. ఆర్థిక నిపుణుడిగా పేరుపొందిన రోశయ్య.. 2005-06లో బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే.. ప్రణాళిక వ్యయం పెరగాలని, ప్రణాళికేతర వ్యయం తగ్గాలని అభిప్రాయపడేవారు. డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేయడం అనవసరమని ఆయన భావించేవారు.

అసెంబ్లీలో విపక్షాలపై వ్యంగ్యాస్త్రాలు..!

అసెంబ్లీలో రోశయ్య తనదైన శైలిలో విపక్షాలపై వ్యంగ్యాస్త్రాలు సంధించేవారు. ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం నేతలు సభకు అడ్డుతగలడంపై.. రోశయ్య చురకలు అంటించిన తీరు అందరికీ నవ్వు తెప్పించడంతోపాటు ఆలోచింపజేసేదిగా ఉండేది. సందర్భాన్ని బట్టి ఆయన చెప్పే పిట్టకథలు ప్రతిపక్షాలకు సూదుల్లా గుచ్చుకునేవనడంలో ఎలాంటి సందేహం లేదు.

Read latest General News and Telugu News



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని