Supreme Court: అవినాష్‌రెడ్డి బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా

వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్‌రెడ్డి బెయిల్‌ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది.

Updated : 05 Feb 2024 16:06 IST

దిల్లీ: వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి బెయిల్‌ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. ఏప్రిల్‌ మూడో వారంలో కేసు తుది వాదనలు వింటామని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాలతో కూడిన ధర్మాసనం వెల్లడించింది. ఏప్రిల్ 22కి ముందు కేసు విచారణకు తీసుకునే పరిస్థితి లేదని స్పష్టం చేసింది. ఈలోపు కేసు డైరీ మొత్తాన్ని కోర్టు ముందు ఉంచాలని ఆదేశించగా.. అది 60 భాగాలుగా ఉందని సీబీఐ తరఫు న్యాయవాది తెలిపారు. అయితే, వాటిని డిజిటల్‌ రూపంలోకి మార్చి ఈ-డైరీ సమర్పించాలని ఆదేశించింది. అవినాష్‌రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని