TS News: తెలంగాణలో 9 మంది ఐఏఎస్‌ల బదిలీ.. టీఎస్‌పీఎస్సీ కార్యదర్శిగా నవీన్‌ నికోలస్‌

తెలంగాణలో 9 మంది ఐఏఎస్‌ అధికారులు, ఒక ఐఎఫ్‌ఎస్‌ అధికారిని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. 

Published : 04 Feb 2024 23:26 IST

హైదరాబాద్‌: తెలంగాణలో 9 మంది ఐఏఎస్‌ అధికారులు, ఒక ఐఎఫ్‌ఎస్‌ అధికారి బదిలీ అయ్యారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్‌ ఉన్నారు.   

బదిలీ అయిన అధికారులు వీరే..

  • బీసీ సంక్షేమ శాఖ కమిషనర్‌గా బి.బాల మాయదేవి
  • పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి కమిషనర్‌గా అనిత రామచంద్రన్‌
  • టీఎస్‌పీఎస్సీ కార్యదర్శిగా ఇ.నవీన్‌ నికొలస్‌ 
  • సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్‌గా ఎం.హన్మంతరావు
  • ఉద్యానవన డైరెక్టర్‌గా కె.అశోక్‌ రెడ్డి
  • ఫిషరీస్‌ కమిషనర్‌గా బి.గోపికి అదనపు బాధ్యతలు
  • మహిళ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా ఎ.నిర్మల కాంతి వెస్లీ
  • మహిళ ఆర్థిక సంస్థ ఎండీగా కూడా కొనసాగనున్న ఎ.నిర్మల కాంతి వెస్లీ
  • ఎస్సీ, ఎస్టీ గురుకులాల కార్యదర్శిగా కె.సీతాలక్ష్మి
  • హైదరాబాద్‌ చీఫ్‌ రేషనింగ్‌ అధికారిగా జి.ఫణీంద్ర రెడ్డి
  • పౌరసరఫరాల శాఖ డైరెక్టర్‌గా ఐఎఫ్‌ఎస్‌ అధికారి వి.ఎస్‌.ఎన్‌.వి.ప్రసాద్‌
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని