Amaravati News: తుళ్లూరు దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్తత

రాజధాని అమరావతి పరిధిలోని తుళ్లూరు వద్ద ఉద్రిక్తత నెలకొంది. అమరావతి ఐక్యకార్యాచరణ సమితి పిలుపు

Updated : 08 Aug 2021 20:54 IST

అమరావతి: రాజధాని అమరావతి పరిధిలోని తుళ్లూరు వద్ద ఉద్రిక్తత నెలకొంది. అమరావతి ఐక్యకార్యాచరణ సమితి పిలుపు మేరకు దీక్షా శిబిరం నుంచి మంగళగిరి ఆలయానికి ర్యాలీగా వెళ్లేందుకు సిద్ధమైన రైతులు, మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో వారు వాగ్వాదానికి దిగారు. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే అడ్డుకోవడమేంటని నిలదీశారు. అదే సమయంలో రైతుల బైక్‌ ర్యాలీని పోలీసులు అడ్డుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో దీక్షా శిబిరంలో ఉన్న మహిళలు, రైతులు హైకోర్టు వైపు పరుగులు తీశారు.

పలువురు తెదేపా నేతల అరెస్ట్‌

మరోవైపు తాడేపల్లిలో తెదేపా కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. తాడేపల్లి నుంచి హైకోర్టు వరకు ర్యాలీగా వెళ్లేందుకు యత్నించగా వారిని నిలువరించారు. మరికొందరు తెదేపా కార్యకర్తలు పోలీసు వలయాన్ని ఛేదించుకుని ఉండవల్లి కూడలికి బయల్దేరారు. ఈ క్రమంలో మంగళగిరి మండలం నవులూరులో తెదేపా నేత గంజి చిరంజీవి సహా పలువురు నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని