AP Schools Reopen: ఏపీలో పాఠశాలలు పునఃప్రారంభం ఎప్పుడంటే..

ఏపీలో ఆగస్టు 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Updated : 23 Jul 2021 16:01 IST

అమరావతి: ఏపీలో ఆగస్టు 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విద్యాశాఖలో నాడు-నేడు, అంగన్వాడీలపై సీఎం జగన్‌ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమీక్షలో సీఎం మాట్లాడుతూ ఆగస్టు 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభించాలని ఆదేశించారు. మొదటి విడత నాడు-నేడు పనులను ఆగస్టు 16నే ప్రజలకు అంకితం చేస్తామని చెప్పారు. అనంతరం రెండో విడత పనులకు శ్రీకారం చుట్టాలని  నిర్ణయించారు. మరోవైపు నూతన విద్యావిధానంపై ప్రభుత్వం అదేరోజు సమగ్రంగా వివరించనుంది.

విద్యాశాఖ మంద్రి ఆదిమూలపు సురేశ్‌ మాట్లాడుతూ.. ‘‘వైద్యారోగ్య శాఖ సూచనల మేరకు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తాం. దీనిపై ఇప్పటికే ఉపాధ్యాయులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఉపాధ్యాయులు‌, బోధనేతర సిబ్బందికి యుద్ధప్రాతిపదికన వ్యాక్సిన్‌ వేయించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్లు, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశాం’’ అని మంత్రి వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని