
Updated : 29 Dec 2021 18:12 IST
TS News: నార్సింగ్‌లోని ప్రైవేటు కళాశాలలో కరోనా కలకలం
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నార్సింగ్‌లోని ఓ కార్పొరేట్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో కరోనా కలకలం రేపింది. నిన్న 14 మంది విద్యార్థులు వైరస్ బారిన పడగా, ఇవాళ మరో 17 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. దీంతో కళాశాలలో ఇప్పటి వరకు నమోదైన కొవిడ్ కేసుల సంఖ్య 31కి చేరింది. మొత్తం 300 మంది విద్యార్థులకు గాను నిన్న 125 మందికి కరోనా పరీక్షలు చేయగా..ఇవాళ మిగతా విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు.
Tags :