CBI-ED: జగతి పబ్లికేషన్స్‌ కేసులో దర్యాప్తు పూర్తయింది: ఈడీ

జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడుల కేసులో దర్యాప్తు పూర్తయిందని సీబీఐ కోర్టుకు     ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరేక్టరేట్‌ (ఈడీ) తెలిపింది. జగన్‌, విజయసాయిరెడ్డి, జగతి

Updated : 30 Sep 2021 01:22 IST

హైదరాబాద్‌: జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడుల కేసులో దర్యాప్తు పూర్తయిందని సీబీఐ కోర్టుకు     ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరేక్టరేట్‌ (ఈడీ) తెలిపింది. జగన్‌, విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్‌ ప్రమేయంపై దర్యాప్తు పూర్తయిందని పేర్కొంటూ సీబీఐ కోర్టులో ఈడీ మెమో దాఖలు చేసింది.  అభియోగాల నమోదు, డిశ్ఛార్జి పిటిషన్లపై వాదనలు వినిపించాలని జగన్‌, విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్‌ను సీబీఐ కోర్టు ఆదేశించింది.  వాదనలు వినిపించేందుకు ఇదే చివరి అవకాశమని న్యాయస్థానం స్పష్టం చేసింది. జగన్‌, విజయసాయిరెడ్డి డిశ్ఛార్జి పిటిషన్లపై కౌంటర్లు దాఖలు చేసేందుకు సీబీఐ మరోసారి గడువు కోరింది. శామ్యూల్‌ డిశ్ఛార్జి పిటిషన్‌పై వాదనల కోసం ఇండియా సిమెంట్స్‌ కేసును అక్టోబరు 1కి, రాజగోపాల్‌ డిశ్ఛార్జి పిటిషన్‌పై వాదనల కోసం రఘురాం సిమెంట్స్‌ కేసు అక్టోబరు 4కి వాయిదా పడింది. ఎమ్మార్‌ కేసులో కోనేరు మధు ప్రమేయంపై సమాచారం కోరుతూ విదేశాలకు పంపించిన ఎల్‌ఓఆర్‌లు ఏ స్థాయిలో ఉన్నాయో తెలపాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. ఎమ్మార్‌ కేసులో తదుపరి దర్యాప్తుపై వివరాలు తెలిపేందుకు  రెండు వారాలు గడువు కావాలని ఈడీ కోరింది. ఎమ్మార్‌ ఈడీ కేసును అక్టోబరు 12కి, సీబీఐ కేసును అక్టోబరు 4కి వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని