
Updated : 27 Oct 2021 17:08 IST
Tirumala: తిరుమల శ్రీవారికి భారీగా బంగారం విరాళం
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామి (Venkateswara Swamy) వారికి తమిళనాడుకు చెందిన ఓ సంస్థ భారీగా బంగారాన్ని విరాళంగా అందించింది. కోయంబత్తూరుకు చెందిన ఎం అండ్ సీ ప్రాపర్టీస్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (M & C Properties and Development Company Pvt. Ltd) సంస్థ రూ.1.83 కోట్లు విలువైన 3.60 కిలోల బంగారు బిస్కెట్లను స్వామి వారికి కానుకగా సమర్పించింది. ఆలయంలోని రంగనాయకుల మండపంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అదనపు ఈవో ధర్మారెడ్డికి సంస్థ ప్రతినిధులు బంగారు బిస్కెట్లను అందించారు.
ఇవీ చదవండి
Tags :