AP News: మద్యం మత్తులో ఎంపీడీవో వికృత చేష్టలు.. వీడియో వైరల్‌

విజయనగరం జిల్లా గరుగుబిల్లి ఎంపీడీవో రామచంద్రరావు తన కార్యాలయంలో చేసిన వికృత చేష్టలు విస్తు గొలుపుతున్నాయి.

Updated : 12 Aug 2021 13:35 IST

గరుగుబిల్లి: విజయనగరం జిల్లా గరుగుబిల్లి ఎంపీడీవో రామచంద్రరావు తన కార్యాలయంలో చేసిన వికృత చేష్టలు విస్తు గొలుపుతున్నాయి. పనివేళల్లో తోటి ఉద్యోగితో చేసిన నృత్యాలు, మద్యం మత్తులో చేసిన అసభ్యకర ప్రవర్తన ఆలస్యంగా వెలుగు చూశాయి. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో జిల్లా కలెక్టర్ సూర్యకుమారి స్పందించారు. ఎంపీడీవో రామచంద్రరావుపై విచారణకు ఆదేశించారు. కార్యాలయం ఆవరణలో మద్యం సేవిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో జిల్లా రెవెన్యూ అధికారి గణపతిరావును విచారణ అధికారిగా నియమించినట్లు కలెక్టర్ తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని