Tirumala: శ్రీవారి సర్వదర్శన టోకెన్లు ఇకపై ఆన్‌లైన్‌లో.. 

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వ దర్శనం టోకెన్లు ఇకపై ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేయనున్నారు. ఈ నెల 25 ఉదయం 9 గంటలకు టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం..

Updated : 22 Sep 2021 14:25 IST

తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి సర్వ దర్శనం టోకెన్లు ఇకపై ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేయనున్నారు. ఈ నెల 25 ఉదయం 9 గంటలకు టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) విడుదల చేయనుంది. రోజుకు 8 వేల టోకెన్లను భక్తులకు అందుబాటులో ఉంచనుంది. అక్టోబరు 31 వరకు సర్వదర్శనం టోకెన్లను తితిదే వెబ్‌సైట్‌లో విడుదల చేయనుంది. భక్తుల భద్రత దృష్ట్యా ఆన్‌లైన్‌ విధానంలో టోకెన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. టోకెన్లు పొంది దర్శనానికి వచ్చే భక్తులు వ్యాక్సిన్‌ 2 డోసులు పూర్తయిన సర్టిఫికెట్‌ తీసుకురావాలని తితిదే స్పష్టం చేసింది. వ్యాక్సిన్‌ సర్టిఫికెట్ లేకపోతే కరోనా నెగటివ్ ధ్రువపత్రం తీసుకురావాలని తెలిపింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని