AP High Court: కుప్పం ఓట్ల లెక్కింపు పరిశీలనకు ప్రత్యేక అధికారి

కుప్పం మున్సిపాలిటీ ఎన్నిక ఓట్ల లెక్కింపు కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని హైకోర్టు ఆదేశించింది. 

Updated : 16 Nov 2021 16:23 IST

అమరావతి: కుప్పం మున్సిపాలిటీ ఎన్నిక ఓట్ల లెక్కింపు కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని హైకోర్టు ఆదేశించింది. ప్రత్యేక పరిశీలకుడిగా ఐఏఎస్‌ ప్రభాకర్‌రెడ్డిని నియమించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఓట్ల లెక్కింపును వీడియో రికార్డు చేయించాలని ఎస్‌ఈసీకి స్పష్టం చేసింది. కుప్పం మున్సిపల్‌ ఎన్నికలపై హైకోర్టులో లంచ్‌ మోషన్ పిటిషన్‌ దాఖలైంది. దానిపై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది.

ఓట్ల లెక్కింపునకు ప్రత్యేక పరిశీలకుడిని నియమించాలని.. ఓట్ల లెక్కింపు ప్రక్రియను వీడియో తీయించాలని కుప్పం తెదేపా అభ్యర్థులు కోర్టును కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు ప్రత్యేక అధికారిని నియమించింది. మరోవైపు కుప్పంతో పాటు నిన్న పోలింగ్ జరిగిన మరి కొన్ని చోట్ల రేపు ఉదయం 8 గంటల నుంచి ఓట్లు లెక్కింపు జరగనుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని