
Updated : 19 Dec 2021 22:13 IST
Tirumala: తిరుమలలో వైభవంగా శ్రీవారి పౌర్ణమి గరుడసేవ
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 నుంచి 9గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్పస్వామివారు గరుడునిపై ఆలయ మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. పౌరాణిక నేపథ్యం ప్రకారం... 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజేస్తారు. తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో రమేశ్‌బాబు, వీజీవో బాలిరెడ్డి తదితరులు గరుడ సేవలో పాల్గొన్నారు.
Tags :