
Bullet Bandi Song: ‘బుల్లెట్ బండి’ పాటకు తెరాస ఎంపీ స్టెప్పులు.. వీడియో
మహబూబాబాద్: ఇటీవలి కాలంలో బాగా వైరల్ అవుతున్న పాట ‘బుల్లెట్ బండి’. ఈ పాట మొదట యూట్యూబ్ లో విడుదలై మంచి ఆదరణ పొందింది. పెళ్లి కూతురు డ్యాన్స్ చేయడంతో ఒక్కసారిగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఆ పాటపై చిన్నా పెద్దా నృత్యాలు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. ఇప్పుడు ఏకంగా తెరాసకు చెందిన మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత బుల్లెట్టు బండి పాటకు ఆడిపాడారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం జరిగిన ఓ వివాహ వేడుకలో పాల్గొన్న ఎంపీ కవిత.. నూతన వధూవరులతో పాటు వారి కుటుంబసభ్యులతో కలిసి డ్యాన్స్ చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.