AP News: ఉక్కు నిరసనలో సీఎం భాగస్వాములవ్వాలి: స్టీల్‌ ప్లాంట్‌ నిర్వాసితులు

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిర్వాసితులు చేస్తున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి.

Published : 27 Jul 2021 13:09 IST

విశాఖ: విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిర్వాసితులు చేస్తున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ ఉక్కు పరిపాలన విభాగం గేటు ఎదుట నిరసన చేపట్టారు. స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలని వారు డిమాండ్‌ చేశారు. నిర్వాసితులకు భూములు ఇవ్వాలంటూ నినదించారు. సీఎంతో పాటు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు విశాఖ వచ్చి కార్మికుల నిరసనలో భాగస్వాములవ్వాలన్నారు. 

ప్రజాప్రతినిధులంతా కలిసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణ జరిగితే ఉద్యోగులు రోడ్డున పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు పరిశ్రమ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనకపోతే వారి ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని