Airport Metro: ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణానికి టెండర్ల ఆహ్వానం

ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణానికి హెచ్‌ఏఎంఎల్‌ టెండర్లు ఆహ్వానించింది. రేపట్నుంచి బిడ్డింగ్‌ పత్రాలను జారీ చేయనుంది.

Published : 16 May 2023 16:25 IST

హైదరాబాద్‌: ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణానికి హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ మెట్రో రైల్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎంఎల్‌) టెండర్లు ఆహ్వానించింది. రేపట్నుంచి బిడ్డింగ్‌ పత్రాలను జారీ చేయనున్నట్లు హెచ్‌ఏఎంఎల్‌ వెల్లడించింది. బిడ్డింగ్‌కు జులై 5 వరకు గడువు విధించింది. మెట్రో కాంట్రాక్టు విలువ రూ.5,688 కోట్లుగా నిర్ధరించింది.

ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అవసరమైన ఈపీసీ టెండర్‌ డాక్యుమెంట్లను తయారు చేసేందుకు జనరల్‌ ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్‌గా సిస్ట్రా, రైట్స్‌ డీబీ ఇంజినీరింగ్‌ సంస్థల కన్సార్టియంను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.  జనరల్‌ కన్సల్టెంట్‌ ఎంపిక కోసం మొత్తం 5 అంతర్జాతీయ కన్సార్టియంలు పోటీ పడగా... వాటి సాంకేతిక సామర్థ్యం, అనుభవం పరిగణనలోకి తీసుకుని కన్సార్టియంను ఎంపిక చేశారు. హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు మెట్రో నిర్మాణంలో పలు విభాగాల్లో నిష్ణాతులైన 18మంది ఇంజినీరింగ్‌ నిపుణులు, క్షేత్రస్థాయిలో మరో 70మంది సీనియర్‌ ఇంజినీర్లు తదితర సిబ్బందిని కన్సార్టియం సమకూర్చుతుంది. ఇంజినీరింగ్‌ కన్సల్టెన్సీ వెంటనే తన పనిని ప్రారంభిస్తుందని మెట్రోరైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి గతంలో తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని