Monkeypox: విజయవాడ చిన్నారికి మంకీపాక్స్‌ కాదని నిర్ధరణ

విజయవాడలో మంకీ పాక్స్‌ కలకలం రేపిన విషయం తెలిసిందే. ఓ చిన్నారికి వ్యాధి లక్షణాలు ఉన్నట్లుగా అధికారులు అనుమానించారు

Published : 18 Jul 2022 01:35 IST

విజయవాడ: విజయవాడలో మంకీ పాక్స్‌ కలకలం రేపిన విషయం తెలిసిందే. ఓ చిన్నారికి వ్యాధి లక్షణాలు ఉన్నట్లుగా అధికారులు అనుమానించారు. దుబాయి నుంచి వచ్చిన కుటుంబంలోని చిన్నారి శరీరంపై దద్దుర్లు రావడంతో మంకీ పాక్స్‌ కేసుగా భావించారు. బాలిక నమూనాలను తీసి పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. పరీక్షల్లో మంకీ పాక్స్‌ నెగెటివ్‌గా నిర్ధరణ అయిందని వైద్యులు తెలిపారు. బాలిక కుటుంబం ఇతరులతో కాంటాక్టు కాలేదని ఆరోగ్యశాఖ కమిషనర్‌ తెలిపారు. ప్రస్తుతం విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రిలో చిన్నారికి చికిత్స చేస్తున్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని