Lifestyle: ఉదయం నిద్రలేవగానే మర్చిపోకుండా చేయాల్సిన పనులు ఇవే!

ఉదయం లేవగానే చాలామంది ఫోన్లు పట్టుకుని కూర్చుంటారు. దీంతో ఎంత సమయం వృథా అవుతుంది. అందుకే ఉదయం నిద్రలేచిన తరవాత ఫోన్‌ ఉపయోగించకూడదు. రోజుని ఎంత ఉషారుగా మొదలు పెడితే ఫలితాలు అంత విజయవంతంగా వస్తాయి.

Published : 19 Sep 2022 06:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉదయం లేవగానే చాలామంది ఫోన్లు పట్టుకుని కూర్చుంటారు. దీంతో ఎంత సమయం వృథా అవుతుంది. అందుకే ఉదయం నిద్రలేచిన తరవాత ఫోన్‌ ఉపయోగించకూడదు. రోజుని ఎంత ఉషారుగా మొదలు పెడితే ఫలితాలు అంత విజయవంతంగా వస్తాయి. మరి ఉదయం నిద్రలేచిన తరవాత ఏఏ పనులు చేయాలో తెలుసుకోండి! 

* నిద్రలేచిన వెంటనే రెండు గ్లాసుల నీళ్లు తాగండి. ఇది మీరు రోజంతా ఉత్సాహంగా, ఆరోగ్యంగా పని చేసేందుకు ఉపయోగపడుతుంది. మీరు ఎక్కడికి వెళ్లినా వాటర్‌ బాటిల్‌ వెంట పెట్టుకుని వెళ్లండి. 

* ఓ మైలు దూరం వరకూ జాగింగ్‌ చేయండి. దీంతో మీ కండరాలకు శక్తి చేకూరుతుంది. శరీరం ఫిట్‌గా ఉంటుంది. మెదడు చురుగ్గా పని చేస్తుంది. 

* ప్రాణాయామం, యోగా చేయండి. తరచూ చేస్తూ ఉండటం ద్వారా ఒత్తిడి తగ్గుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. 
* ఆవిరి పట్టుకోండి!
వైరస్‌ల బారిన పడకుండా ఉండేందుకు , ఊపిరి సులువుగా తీసుకునేందుకు ఆవిరి పట్టుకోవడం మంచి పద్ధతి. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. 
* ఆరోజు చేయాల్సిన పనులన్నిటినీ డైరీలో రాసుకోండి.
* అల్పాహారం తప్పకుండా చేయాలి. సరైన సమయానికి ఆహారం తీసుకున్నపుడే పనులను అనుకున్న సమయంలో పూర్తి చేయగలరు. 

* ఆత్మవిశ్వాసంతో మొదలు పెట్టే పని ఏదైనా మంచి ఫలితాలను ఇస్తుంది. మీ రోజుని ఆనందంతో, విశ్వాసంతో ఆరంభించండి. విజయం తప్పక మీ సొంతమవుతుంది.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని