Anand Mahindra: ఉద్యోగం ఇవ్వండి సర్! యువకుడి విజ్ఞప్తికి ఆనంద్‌ మహీంద్రా స్పందన వైరల్‌

వినూత్న ఆవిష్కరణలకు ఎల్లప్పుడూ ప్రోత్సాహంగా నిలిచే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా.(Anand Mahindra). తాజాగా ఓ యువకుడి ప్రతిభకు ముగ్ధుడయ్యారు...

Published : 21 Aug 2022 01:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వినూత్న ఆవిష్కరణలకు ఎల్లప్పుడూ ప్రోత్సాహంగా నిలిచే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా.(Anand Mahindra). తాజాగా ఓ యువకుడి ప్రతిభకు ముగ్ధుడయ్యారు! విద్యుత్‌ వాహనం(EV)లో చేపట్టిన మార్పులను చూపుతూ ఉద్యోగాన్ని కోరిన అతని విషయంలో సానుకూలంగా స్పందించారు. ఆనంద్‌ మహీంద్రా ఇటీవల ఓ ఎలక్ట్రిక్‌ కారుపై ట్వీట్‌ చేశారు. దీనిపై గౌతమ్‌ అనే యువకుడు స్పందిస్తూ.. మార్పులు చేపట్టిన ఓ విద్యుత్‌ వాహన వీడియోను పోస్ట్‌ చేశాడు. ‘ఈ ఎలక్ట్రిక్‌ జీప్‌ ముందు, వెనుక చక్రాలను మనం వేర్వేరుగా నియంత్రించవచ్చు. దయచేసి నాకు ఉద్యోగం ఇవ్వండి సర్‌’ అంటూ విజ్ఞప్తి చేశాడు.

తాజాగా ఆ యువకుడి అభ్యర్థనకు స్పందించిన ఆనంద్‌ మహీంద్రా.. అతణ్ని సంప్రదించాలంటూ సిబ్బందికి సూచించారు. అతని వీడియోపై స్పందిస్తూ.. ‘ఇందుకే.. ‘ఈవీ’ల్లో భారత్‌ అగ్రగామిగా నిలుస్తుందని నమ్ముతున్నా. కార్లు, సాంకేతికతపై మక్కువ, గ్యారేజ్‌లో వినూత్న ప్రయోగాల కారణంగానే ఆటోమొబైల్‌ రంగంలో అమెరికా తన ఆధిపత్యాన్ని చాటింది. గౌతమ్‌తోపాటు అలాంటి వ్యక్తులు మరింత ఎదగాలి’ అని ఆకాంక్షించారు. మహీంద్రా స్పందన కాస్త నెట్టింట్ వైరల్‌గా మారింది. ‘వినూత్న ఆలోచనలకు మీరు మద్దతు ఇచ్చే విధానం.. మీ వినయానికి నిదర్శనం’ అని ఓ నెటిజన్‌ స్పందించారు. దేశం పట్ల మీ విశ్వాసం, ప్రేరణ ఎల్లప్పుడూ యువతకు ఆదర్శనీయమని మరొకరు కామెంట్‌ పెట్టారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని