Mothers: అమ్మలూ ఈ జాగ్రత్తలు తీసుకోండి!
అమ్మ అయ్యారంటే చాలు బాధ్యతలు, పిల్లల బాగోగులు చూసుకోవటం, వాళ్ల భవిష్యత్తు ప్రణాళికను వేయడం వంటి పనులకే తల్లులు అంకితం అవ్వాల్సి ఉంటుంది.
ఇంటర్నెట్ డెస్క్: అమ్మ అయితే చాలు బాధ్యతలు, పిల్లల బాగోగులు చూసుకోవడం, వాళ్ల భవిష్యత్తు ప్రణాళికలను వేయడం వంటి పనులకే తల్లులు అంకితమవ్వాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా మహిళలు తమకంటూ ఒక జీవితం ఉందనే విషయాన్నే మర్చిపోతారు. కానీ అమ్మతనాన్ని ఎంజాయ్ చేస్తూనే మీకంటూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోండిలా!
- అమ్మ కాగానే రోజూవారి పనితీరుతో పాటు శరీరంలో కూడా మార్పులు వస్తాయి. పిల్లల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో.. మీ ఆరోగ్య విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉండండి. రోజూ వ్యాయామం చేయండి. శరీరాన్ని ఎప్పుడూ ఫిట్ గా ఉంచుకునేందుకు ప్రయత్నించండి.
- అన్నింటిలో పర్‌ఫెక్ట్‌గా ఉండాలని ప్రయత్నించకండి. మీకు సాధ్యపడే పనులు మాత్రమే చేయండి. పిల్లలకు అవసరమయ్యే అన్నింటినీ అందించాలని పరుగులు తీయకండి. ఈ పరుగులో మిమ్మల్ని మీరు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. పిల్లల్ని మీ స్థాయిలోనే పెంచండి.
- పిల్లలతో కఠినంగా ఉండటం కంటే ప్రేమగా ఉండటమే ఉత్తమం. దీంతో పిల్లలు మీకు ఎక్కువగా దగ్గరవుతారు. మీ పిల్లలతో పాటు మీరు కూడా ఆడండి. వాళ్లతో కలిసి వివిధ రకాల యాక్టివిటీలు చేయండి.
- కుటుంబ బాధ్యత మొత్తం మీ మీదే ఉంటుంది. కాబట్టి అందరి మీద దృష్టి నిలపండి. మీ పిల్లలు చెప్పే మాటలను వినండి. ఏదైనా పనిలో ఉండి, ఫోన్ చూస్తూ పిల్లలు చెప్పేది వినకుంటే వాళ్లు నిరాశ చెందుతారు. అందుకే పిల్లలు మీకు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు వారి మాటలు వినండి. దీంతో వాళ్ల ఆలోచనలు ఎలా ఉంటున్నాయో కూడా మీకు తెలిసే అవకాశం ఉంటుంది.
- పిల్లలతో వెకేషన్‌కు వేళ్లేందుకు ప్లాన్ చేయండి. ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో వాళ్ల అభిప్రాయం కూడా తీసుకోండి.
- కొంతమంది తల్లులు ఎప్పుడూ సీరియళ్లు, ఫోన్లు చూస్తూ ఉంటారు. ఈ ప్రవర్తన పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది. మీలాగే మీ పిల్లలు కూడా ఫోన్లకు బానిసలవుతారు. ఇది ఎంత మాత్రం మంచిది కాదు. పిల్లలకు మీరు ఓ స్ఫూర్తిప్రదాతలా ఉండాలి. మీ ప్రవర్తన తీరు చూస్తూనే వాళ్లు పెరుగుతారు కాబట్టి మరింత జాగ్రత్తగా నడుచుకోవాల్సిన అవసరం ఉంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Siddique Kappan: 28 నెలల తర్వాత.. కేరళ జర్నలిస్టు కప్పన్ బెయిల్పై విడుదల
-
India News
‘మీరు లేకుండా మేం మెరుగ్గా ఉన్నాం’.. బెంగాల్ సీఎంపై వర్సిటీ తీవ్ర వ్యాఖ్యలు..!
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Crime News
Kadapa: కడప నడిబొడ్డున ఇద్దరు యువకుల దారుణహత్య
-
World News
Miss Universe : మిస్ యూనివర్స్ పోటీలు.. నన్ను చూసి వారంతా పారిపోయారు..!
-
Movies News
Samantha: ఎంతోకాలం తర్వాత గాయని చిన్మయి గురించి సమంత ట్వీట్