Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 31 Jul 2021 13:12 IST

1. Banking: ఆగస్టు 1వ తేదీ నుంచి మారేవి ఇవే..

ఆగస్టు 1వ తేదీ నుంచి బ్యాంకింగ్‌, ఆర్థిక రంగ సేవల్లో పలు మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రాకు ఛార్జీలు పెరిగాయి. ఐసీఐసీఐ బ్యాంకు నగదు లావాదేవీలపై ఛార్జీలను పెంచింది. ఇవన్నీ ఆదివారం నుంచే అమల్లోకి రానున్నాయి. మరి రేపటి నుంచి జరగబోయే మార్పులేంటో.. ఓసారి చూద్దాం..! ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి అన్ని ఏటీఎం కేంద్రాల్లోనూ ఒక్కో ఆర్థిక లావాదేవీపై ఇంటర్‌ఛేంజ్‌ ఫీజు రూ.15 నుంచి రూ.17కు, ఆర్థికేతర లావాదేవీలపై రూ.5 నుంచి రూ.6కు ఛార్జీ పెంచుకునేందుకు బ్యాంకులకు ఆర్‌బీఐ అనుమతిచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Samantha: పేరు మార్చుకున్న సమంత.. ఆఖరికి ఇది కూడా చర్చేనా!

అగ్రకథానాయిక సమంత పేరు మార్చుకున్నారు. అయితే అది నిజ జీవితంలో కాదు. ‘ఏమాయ చేసావే’తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సామ్‌.. పలు సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌ వేదికగా తరచూ అభిమానులకు చేరువగా ఉంటారనే విషయం అందిరికీ తెలిసిందే. Samantharuthuprabhu అనే తన పూర్తి పేరుతో ఫేస్‌బుక్‌, ట్విటర్‌ ఖాతాలు ప్రారంభించిన ఆమె అక్కినేని వారసుడు నాగచైతన్యతో ఏడడుగులు వేసిన అనంతరం Samantha Akkineniగా ఆయా ఫ్లాట్‌ఫామ్స్‌లో పేరు మార్చుకున్నారు. సామ్‌ చేసిన పనికి అప్పట్లో అందరూ ఆమెపై పొగడ్తల వర్షం కురిపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. India-China: భారత్‌ - చైనా మధ్య 12వ విడత చర్చలు ప్రారంభం

సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి, తూర్పు లద్దాఖ్‌లో నెలకొన్న సైనిక ప్రతిష్టంభనను పరిష్కరించుకునేందుకు భారత్‌, చైనాల మధ్య 12వ విడత ఉన్నత స్థాయి సైనిక కమాండర్ల చర్చలు శనివారం ప్రారంభమయ్యాయి. ఎల్‌ఏసీ వెంబడి చైనా భూభాగంలో ఉన్న మోల్డో బోర్డర్‌ పాయింట్‌ వద్ద ఉదయం 10.30 గంటలకు ఇరు దేశాల సైనికాధికారులు సమావేశమయ్యారు. తూర్పు లద్దాఖ్‌లోని హాట్‌స్ప్రింగ్‌, గోగ్రా తదితర ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణపై ఈ దఫా చర్చల్లో దృష్టి సారించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Border Row: అస్సాం సీఎంపై కేసు.. మిజోరం ఎంపీ కోసం పోలీసుల గాలింపు

4. Chandra babu: దాడి చేసి రివర్స్‌ కేసులు పెడతారా?

దేవినేని ఉమపై కేసులు పెట్టడం చాలా దుర్మార్గమని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. వైకాపా నాయకులే దాడి చేసి రివర్స్‌ కేసు పెట్టారని ధ్వజమెత్తారు. ‘జరిగిన ఘటన మొత్తాన్ని ప్రజలంతా గమనించారు. ఎస్సీలపై దాడి చేసినట్లు దేవినేనిపై తప్పుడు కేసులు పెట్టారు. అక్రమ మైనింగ్‌ జరుగుతోందని చెప్పినా పట్టించుకోలేదు. దేవినేని ఉమపై కేసులు పెట్టడం దుర్మార్గమైన చర్య. దాడి చేసి రివర్స్‌ కేసు పెట్టడం నీచమైన పని. డీజీపీ ఇంత దుర్మార్గంగా ప్రవర్తించడం సిగ్గుచేటు’ అని చంద్రబాబు అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Delta Variant: డెల్టా ఓ హెచ్చరిక.. అదుపు చేయకపోతే మరిన్ని ప్రమాదకర వేరియంట్లు!

ప్రపంచవ్యాప్తంగా కరోనా డెల్టా వేరియంట్‌ భారీ స్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) దేశాలకు కీలక సూచనలు చేసింది. డెల్టా వేరియంట్‌ వ్యాప్తి.. మరిన్ని ప్రమాదకరమైన వేరియంట్లు పుట్టకముందే మహమ్మారిని అదుపు చేయాలన్న హెచ్చరిక జారీ చేస్తోందని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో కరోనాను అంతం చేసే దిశగా వేగవంతమైన చర్యలు చేపట్టాలని సూచించింది. తొలుత భారత్‌లో వెలుగులోకి వచ్చిన ఈ వేరియంట్‌ ఇప్పటి వరకు 132 దేశాలకు పాకింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Corona: కొనసాగుతున్న వైరస్ వ్యాప్తి..40వేలపైనే కేసులు

6. CBSE: వచ్చేవారం సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలు...

సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) 10వ తరగతి ఫలితాలపై కసరత్తును ముమ్మరం చేసినట్టు సీబీఎస్‌ఈ పరీక్షల నిర్వహణ అధికారి సన్యం భరద్వాజ్‌ తెలిపారు. వచ్చే వారంలో ఈ ఫలితాలను విడుదల చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. రికార్డు స్థాయిలో 99.37శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా సన్యం భరద్వాజ్‌ మీడియాతో మాట్లాడుతూ.. పదో తరగతి ఫలితాలను వచ్చేవారంలో విడుదల చేసేందుకు కసరత్తు జరుగుతోందని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. NTR: ఎమ్మార్వో కార్యాలయంలో తారక్‌.. ఫొటోలు దిగిన ఉద్యోగులు

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూట్‌తో ఫుల్‌ బిజీగా ఉన్న తారక్‌ తాజాగా రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో సందడి చేశారు. ఆయన రాక పట్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. శంకర్‌పల్లి మండలం పరిధిలోని గోపాలపురంలో తారక్‌ ఇటీవల ఆరున్నర ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేశారు. ఆ భూమి రిజిస్ట్రేషన్‌ పనుల నిమిత్తం ఆయన శుక్రవారం మధ్యాహ్నం శంకర్‌పల్లి ఎమ్మార్వో కార్యాలయానికి వచ్చారు. ఎన్టీఆర్‌ రాకతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా సందడి వాతావరణం నెలకొంది. కార్యాలయంలోని ఉద్యోగులు ఆయనతో ఫొటోలు దిగేందుకు ఆసక్తి కనబరిచారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

RC 15: రామ్‌చరణ్‌-శంకర్‌ ప్రాజెక్ట్‌ హీరోయిన్‌ ఫిక్స్‌..! చెర్రీతో రెండోసారి జోడీ కట్టనున్న బ్యూటీ

8. Credit Card: ఇలాంటి క్రెడిట్‌ కార్డు తీసుకుంటే మీకే ఎక్కువ లాభం!

ప్రజల్లో ఆర్థిక అంశాలపై అవగాహన పెరుగుతోంది. డిజిటల్‌ లావాదేవీలకు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. క్రెడిట్‌ కార్డుల వినియోగం కూడా ఎక్కువయ్యింది. అయితే, క్రెడిట్‌ కార్డుల్లో చాలా రకాలుంటాయి. సాధారణంగా మనం బ్యాంక్‌ లేదా థర్డ్‌ పార్టీ కంపెనీలు ఏ కార్డుని ఆఫర్‌ చేస్తే ఆ కార్డునే తీసుకుంటుంటాం. కానీ, అది సరైన పద్ధతి కాదు. మీ అవసరం, వినియోగించే తీరును బట్టి కార్డును తీసుకోవాలి. ముఖ్యంగా తక్కువ ఛార్జీలతో ఎక్కువ ప్రయోజనాలుండే వాటిని ఎంపిక చేసుకోవాలి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Tokyo Olympics: భారత మహిళల హాకీ జట్టు ఆశలన్నీ బ్రిటన్‌పైనే

ఒలింపిక్స్ మహిళల హాకీ పోటీల్లో భారత జట్టు గ్రూప్‌-ఏలో చివరి మ్యాచ్‌ గెలిచి క్వార్టర్‌ ఫైనల్స్‌ ఆశలు సజీవంగా ఉంచుకుంది. తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 4-3 తేడాతో విజయం సాధించింది. దాంతో గ్రూప్‌ దశలో వరుసగా రెండో విజయం సాధించి ఆరు పాయింట్లతో నిలిచింది. అయితే, భారత జట్టు క్వార్టర్‌ ఫైనల్స్‌ చేరాలంటే నేటి సాయంత్రం వరకూ వేచి చూడాలి. గ్రూప్‌-ఏలో చివరి మ్యాచ్‌ ఐర్లాండ్‌, బ్రిటన్‌ మధ్య శనివారం సాయంత్రం జరగనుంది. అందులో బ్రిటన్‌ గెలిచినా లేదా మ్యాచ్‌ డ్రాగా ముగిసినా భారత్‌ తర్వాతి దశకు వెళ్తుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Tokyo olympics : మహిళల డిస్కస్‌త్రో.. ఫైనల్‌కు కమల్‌ప్రీత్‌ కౌర్‌ అర్హత

10. Elon Musk: ఎలాన్‌ మస్క్‌ యాపిల్‌ సీఈఓ కావాలనుకున్నారట.. నిజమెంత?

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌ ఒకప్పుడు టెక్‌ దిగ్గజం యాపిల్‌కు సీఈఓ కావాలనుకున్నారని వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ పాత్రికేయుడు టిమ్‌ హిగిన్స్ తన పుస్తకం ‘పవర్‌ ప్లే’లో రాశారు. దీని వెనుక ఉన్న అంశాల్ని తాజాగా ‘లాస్‌ఏంజిల్స్‌ టైమ్స్‌’ ప్రచురించింది. అయితే, ఈ కథనాన్ని మస్క్‌ ఖండించారు. తానెప్పుడూ అలాంటి ప్రతిపాదనను ముందుకు తీసుకురాలేదని స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని